జమ్మూలో ముగ్గురు ఉగ్రవాదులు హతం..

జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. ఓ పోలీసుకు స్వల్పగాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం

Updated : 31 Jan 2020 11:54 IST

జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. ఓ పోలీసుకు స్వల్పగాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం నలుగురు ఉగ్రవాదుల బృందం ఓ వ్యానులో ప్రయాణిస్తుండగా భద్రతాసిబ్బంది గుర్తించారు. నగ్రోటా చెక్‌పోస్టు వద్ద వారిని ఆపేందుకు ప్రయత్నించారు. కానీ, ముష్కరులు వాహనాన్ని ఆపకుండా దూసుకెళ్లారు. వెంబడించిన భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ క్రమంలో ముగ్గురు ఉగ్రవాదులు హతమవ్వగా మరో వ్యక్తి అటవీ ప్రాంతంలోకి పారిపోయాడు. అతడి కోసం ప్రస్తుతం గాలింపు కొనసాగుతోంది.

ప్రత్యేక ట్రక్కులో...

ముష్కరులు ఇటీవలే సరిహద్దుల నుంచి చొరబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కథువా, హీరానగర్‌ సరిహద్దు గుండా వారు భారత్‌లోకి ప్రవేశించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అక్కడి నుంచి శ్రీనగర్‌ ఓ ప్రత్యేక ట్రక్కులో ప్రయాణిస్తున్నారు. ట్రక్కు వెనకభాగంలో కొన్ని బస్తాల లోడ్ నింపి ఉండగా.. కింది భాగంలో ప్రత్యేక క్యాబిన్‌ తరహా సదుపాయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీనిలో నక్కి ఉగ్రవాదులు ప్రయాణిస్తున్నారు. అనుమానం వచ్చిన పోలీసులు ట్రక్కును ఆపడానికి ప్రయత్నించగా.. ముష్కరులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో పోలీసులు ఎదురుకాల్పులు జరపగా.. ముగ్గురు ఉగ్రవాదులు అక్కడికక్కడే హతమయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని