ఫ్లోరిడాలో కాల్పులు.. ఇద్దరు మృతి

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఫ్లోరిడాలో శనివారం మధ్యాహ్నం జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.......

Published : 02 Feb 2020 11:05 IST

ఫ్లోరిడా: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఫ్లోరిడాలో శనివారం మధ్యాహ్నం జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఓ మైనర్‌ బాలుడు ఉన్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. రివియెరా బీచ్ సమీపంలోని విక్టరీ సిటీ చర్చి వద్ద అంత్యక్రియలకు హాజరై వస్తున్న సమూహంపై దుండగులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. మొత్తం 15 రౌండ్ల కాల్పులు జరిగినట్లు పోలీసులు నిర్ధరించారు. దుండగుల కోసం ముమ్మర గాలింపు జరుగుతోంది. గాయపడ్డవారి ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటివరకు ఆస్పత్రి వర్గాలు ఎలాంటి హెల్త్‌ బులెటిన్ విడుదల చేయలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని