ఎదురొచ్చిన బైకర్స్‌ను సింహం ఏం చేసిందంటే!

సింహాన్ని జూలో చూస్తేనే దాని గాండ్రింపులకు హడలిపోతాం. అలాంటిది అడవిలో బైకుపై వెళ్తుండగా..హఠాత్తుగా మూడు సింహాలు ఎదురుగా వస్తే..! ఆ పరిస్థితిని ఊహించుకుంటేనే గుండె అదిరిపోతోంది కదా. నిజమే గుజరాత్‌లోని గిర్‌ నేషనల్‌ పార్కు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఇద్దరు ...

Published : 04 Feb 2020 19:53 IST

అహ్మదాబాద్‌: సింహాన్ని జూలో చూస్తేనే దాని గాండ్రింపులకు హడలిపోతాం. అలాంటిది అడవిలో బైకుపై వెళ్తుండగా..హఠాత్తుగా మూడు సింహాలు ఎదురుగా వస్తే..! ఆ పరిస్థితిని ఊహించుకుంటేనే గుండె అదిరిపోతోంది కదా. నిజమే గుజరాత్‌లోని గిర్‌ నేషనల్‌ పార్కు,లో ఇద్దరు వ్యక్తులకు ఇలాంటి సంఘటనే ఎదురైంది. అప్పుడేం జరిగిందో తెలుసా..!

గిర్‌ జాతీయ పార్కులోని ఓ మట్టి రోడ్డుపై ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళ్తుండగా.. రెండు కూనలతో కలిసి ఓ సింహం హఠాత్తుగా ఎదురుపడింది. ఆ ఇద్దరిపై ప్రాణాలు పైనే పోయినట్టున్నాయ్‌! చేసేదేమీలేక బైకును నిలిపేశారు. అంతలో సింహం ఏం ఆలోచించిందో ఏమో.. బైకర్లకు దారిచ్చి కూనలతో కలిసి పక్కకు తప్పుకొని వెళ్లిపోయింది. దీంతో వారిద్దరూ బతుకుజీవుడా అని బయటపడ్డారు.

సాధారణంగా సింహాన్ని క్రూర జంతువు అంటాం కదా. ఈ వీడియోను చూస్తే.. ఆది తప్పేమో అనిపించక మానదు. ఎందుకంటే అక్కడ సింహం ప్రవర్తన అలా ఉంది మరి. ఈ వీడియోను రాజ్యసభ ఎంపీ పరిమల్‌ నత్వానీ ట్విటర్‌లో పోస్టు చేయడంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని