నిర్భయ దోషుల ఉరి అమలు స్టేపై నేడు తీర్పు

నిర్భయ అత్యాచార, హత్య కేసులో దోషులకు ఉరిశిక్ష అమలు చేయకుండా దిల్లీ పటియాలా హౌస్‌ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై దిల్లీ హైకోర్టు ఇవాళ..

Updated : 05 Feb 2020 08:48 IST

దిల్లీ: నిర్భయ అత్యాచార, హత్య కేసులో దోషులకు ఉరిశిక్ష అమలు చేయకుండా దిల్లీ పటియాలా హౌస్‌ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై దిల్లీ హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది. కేంద్రం పిటిషన్‌పై శనివారం, ఆదివారం ప్రత్యేకంగా విచారణ జరిపిన దిల్లీ హైకోర్టు ఈ నెల 2న తీర్పును రిజర్వ్‌ చేసింది. దోషుల క్షమాభిక్ష, క్యురేటివ్‌ పిటిషన్లు వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ఉరిశిక్ష అమలుపై పటియాలా హౌస్‌ కోర్టు జనవరి 31న స్టే విధించింది. ఈ స్టేను సవాల్‌ చేస్తూ కేంద్రం, దిల్లీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించాయి.

ఫిబ్రవరి 1న నలుగురు దోషులను ఉరితీయాల్సిందిగా దిల్లీ కోర్టు రెండోసారి డెత్‌ వారెంట్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. కానీ దోషులు తమకు విధించిన ఉరిశిక్షపై స్టే విధించాల్సిందిగా కోరుతూ మరణశిక్షకు రెండు రోజుల ముందు న్యాయస్థానంలో పిటిషన్‌ వేశారు. దీంతో ఉరి అమలు రెండోసారి వాయిదా పడింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఉరి అమలును వాయిదా వేస్తున్నట్లు దిల్లీ కోర్టు తీర్పు వెలువరించింది. దీన్ని సవాల్‌ చేస్తూ కేంద్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన దిల్లీ కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని