ఇజ్రాయెల్‌తో హెచ్‌ఏఎల్‌ ఒప్పందం

మానవరహిత విమానాల(యూఏవీ) తయారీ కోసం ఇజ్రాయెల్‌ ఏరోస్పేస్‌ ఇండస్ట్రీస్‌(ఐఏఐ)తో కలిసి హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌), డైనమెటిక్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌(డీటీఎల్‌) ఒప్పందం కుదుర్చుకున్నాయి........

Published : 05 Feb 2020 23:56 IST

సంయుక్త భాగస్వామ్యంలో యూఏవీల తయారీ

లఖ్‌నవూ: మానవరహిత విమానాల (యూఏవీ) తయారీ కోసం ఇజ్రాయెల్‌ ఏరోస్పేస్‌ ఇండస్ట్రీస్‌ (ఐఏఐ)తో కలిసి హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌), డైనమెటిక్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ (డీటీఎల్‌) ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ భాగస్వామ్యంలో భారత భద్రతా బలగాలకు అవసరమైన యూఏవీలను తయారుచేయనున్నారు. లఖ్‌నవూలో బుధవారం ప్రారంభమైన డిఫెన్స్‌ ఎక్స్‌పో-2020 సందర్భంగా ఈ ఒప్పందం ఖరారైంది. తాజా ఒప్పందంతో సైనిక ఉత్పత్తుల తయారీలో హెచ్‌ఏఎల్‌ సామర్థ్యం పెరిగే అవకాశం ఉందని సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆర్‌.మాధవన్‌ తెలిపారు. అలాగే ఇజ్రాయెల్‌ నుంచి అత్యాధునిక సాంకేతికత సమకూర్చుకునే అవకాశం ఉంటుందన్నారు. ‘భారత్‌లో తయారీ’లో భాగంగానే ఈ ఒప్పందం కుదిరిందన్నారు. భవిష్యత్‌లో భారీ ఎత్తున యూఏవీలను భారత్‌ సైన్యంలో చేర్చేందుకు హెచ్‌ఏఎల్‌ యోచిస్తోందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు