సింధు ఒప్పందం ఉల్లంఘించలేదు: భారత్‌

సింధు నదీజలాల ఒప్పందాన్ని మోదీ ప్రభుత్వం ఉల్లంఘించిందటూ పాక్‌ మీడియాలో వచ్చిన కథనాలను భారత్‌ ఖండించింది. పాక్‌ ఆరోపణలు అసత్యమని, వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని సింధు నదీ జలాల కమిషనర్‌ పీకే సక్సేనా తెలిపారు. అసత్య ఆరోపణలను మానుకోవాలని...

Published : 06 Feb 2020 00:27 IST

దిల్లీ: సింధు నదీజలాల ఒప్పందాన్ని మోదీ ప్రభుత్వం ఉల్లంఘించిందటూ పాక్‌ మీడియాలో వచ్చిన కథనాలను భారత్‌ ఖండించింది. పాక్‌ ఆరోపణలు అసత్యమని, వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని సింధు నదీ జలాల కమిషనర్‌ పీకే సక్సేనా తెలిపారు. అసత్య ఆరోపణలను మానుకోవాలని దాయాది పాక్‌కు సూచించారు. పాకిస్థాన్‌లో నీటి కొరతకు భారత్‌ కారణమని చెప్పడం వాస్తవానికి విరుద్ధంగా ఉందని, స్వదేశంలోని సమస్యల నుంచి ప్రజలను పక్కదోవ పట్టించేందుకే పాక్‌ ఇలాంటి కుటిల ప్రయత్నాలు చేస్తోందని ఆయన అన్నారు. సింధునదిపై ఆనకట్టలు కట్టేందుకు వీలుగా ఐక్యరాజ్య సమితికి భారత్‌ ముసాయిదాను పంపించిందని, తద్వారా అంతర్జాతీయ సింధు నదీ ఒప్పందాలను అతిక్రమిస్తోందన్నది పాక్‌ వాదన. ఈ మేరకు అక్కడి మీడియాలో కథనాలు వచ్చాయి.

మరోవైపు నిబంధనలకు కట్టుబడి ఉన్నామని, సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించడం లేదని భారత్‌ పునరుద్ఘాటించింది. సింధు జల ఒప్పందంలో భాగంగా సింధు, జీలం, చీనాబ్‌ నదులు పాక్‌కు దక్కగా, రావి, బియాస్‌, సట్లెజ్‌ నదులు భారత్‌కు దక్కాయి. 1960లో భారత మాజీ ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ, పాకిస్థాన్ అధ్యక్షుడు ఆయూబ్‌ ఖాన్‌కు మధ్య ఈ నదీ జలాల ఒప్పందం జరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని