భోపాల్‌లో కూలిన రైల్వేస్టేషన్‌ పైవంతెన

భోపాల్‌: ప్లాట్‌ఫాంపై వేచిఉన్న ప్రయాణికులపై పైవంతన కూలిన ఘటన భోపాల్‌ రైల్వే స్టేషన్‌లో జరిగింది. ఈ ఉదయం మూడవ ప్లాట్‌ఫాంపై ఉన్న వంతెనలోని కొంతభాగం ఒక్కసారిగా కుప్పకూలింది.

Updated : 13 Feb 2020 14:51 IST

ప్లాట్‌ఫాంపై వేచిఉన్న ప్రయాణికులకు గాయాలు

భోపాల్‌: రైలు రాక కోసం ప్లాట్‌ఫాంపై వేచిచూస్తున్న ప్రయాణికులపై పైవంతెన కూలిన ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. గురువారం ఉదయం రైల్వేస్టేషన్‌లో మూడో ప్లాట్‌ ఫాంపై ఉన్న పాదచారుల వంతెనలోని కొంతభాగం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 9 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో తక్కువ మంది అక్కడ ఉండటంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామనీ.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రైల్వే స్టేషన్‌ ఉన్నతాధికారులు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని