వలస జాతుల సంరక్షణకు ప్రణాళిక సిద్ధం: మోదీ

భూతాపం తగ్గించే విషయంలో పారిస్‌ ఒప్పందానికి లోబడి పనిచేస్తున్న దేశాల్లో భారత్ ఒకటని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.  గుజరాత్‌లోని గాంధీనగర్‌లో నిర్వహించిన వలస జాతుల...

Published : 17 Feb 2020 18:29 IST

గాంధీనగర్‌‌: భూతాపం తగ్గించే విషయంలో పారిస్‌ ఒప్పందానికి లోబడి పనిచేస్తున్న దేశాల్లో భారత్ ఒకటని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.  గుజరాత్‌లోని గాంధీనగర్‌లో నిర్వహించిన వలస జాతుల సంరక్షణ సదస్సును ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మోదీ ప్రసంగించారు. మధ్య ఆసియా ఫ్లైవే వెంట వలస పక్షులను సంరక్షించడానికి భారతదేశం జాతీయ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర జీవనశైలి, పర్యావరణహిత అభివృద్ధే ప్రధాన సూత్రాలుగా వాతావరణ మార్పు సమస్యను ఎదుర్కొనేందుకు భారత్‌ కృషి చేస్తోందని ప్రధాని ఉద్ఘాటించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని