తల్లినే గుర్తుపట్టలేకపోతున్నా..నిర్భయ దోషి

దిల్లీ: నిర్భయ కేసు దోషులు పలు పిటిషన్లు వేస్తూ ఉరితీత నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దోషుల్లో ఒకరైన వినయ్‌ శర్మ ఈనెల 16న తిహాడ్‌ జైల్లో ఆత్మహత్యాయత్నం చేశాడని తాజాగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

Published : 20 Feb 2020 18:02 IST

మెరుగైన చికిత్స అందించాలని దిల్లీ కోర్టులో పిటిషన్‌

దిల్లీ: నిర్భయ కేసు దోషులు పలు పిటిషన్లతో ఉరితీత నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దోషుల్లో ఒకరైన వినయ్‌ శర్మ ఈనెల 16న తిహాడ్‌ జైల్లో ఆత్మహత్యాయత్నం చేశాడని తాజాగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే స్వల్ప గాయాలు చేసుకున్న వినయ్‌ శర్మకు చికిత్స అందించామని జైలు అధికారులు తెలుపారు. కానీ, వినయ్‌ శర్మ చేతి భుజం విరిగిందని, తలకు బలమైన గాయాల కారణంగా తన తల్లితోపాటు ఎవ్వరినీ గుర్తుపట్టలేకపోతున్నాడని అతని తరపు న్యాయవాది వెల్లడించారు. తనకు మానసిక వైద్య కేంద్రంలో మెరుగైన చికిత్స అందించాలని కోరుతూ దిల్లీ కోర్టులో పిటిషన్‌ వేసినట్లు పేర్కొన్నారు. 

కేంద్ర ఎన్నికల సంఘానికి మరో ఫిర్యాదు..

ఇదిలా ఉంటే తన క్షమాభిక్ష పిటిషన్‌పై దిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు వినయ్‌శర్మ న్యాయవాది ఏపీ సింగ్‌ వెల్లడించారు. జనవరి 29న వినయ్‌శర్మ క్షమాభిక్ష పిటిషన్‌ వేయగా అతని వినతిని తిరస్కరించాలని జనవరి 30న దిల్లీ ప్రభుత్వం రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. సిఫార్సు సమయంలో పిటిషన్‌పై రాష్ట్ర హోంమంత్రి సంతకం చేశారు. అయితే ఆ సమయంలో దిల్లీలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున దిల్లీ హోం మంత్రికి ఎలాంటి అధికారం లేదనే ప్రశ్నను లేవనెత్తారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తూ..దిల్లీ ప్రభుత్వ నిర్ణయం చెల్లుతుందా?లేదా?అనే అంశాన్ని విచారించాలని కోరినట్లు ఏపీ సింగ్‌ వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని