JKలో 7 నెలల తర్వాత తెరచుకున్న పాఠశాలలు

జమ్మూకశ్మీర్‌: దాదాపు 7నెలల సుదీర్ఘ సెలవుల అనంతరం కశ్మీర్‌లో పాఠశాలలు తిరిగి తెరచుకున్నాయి. గత ఆగస్టులో ఆర్టికల్‌ 370రద్దుతో కశ్మీర్‌లో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా చాలాచోట్ల రవాణా, సమాచార వ్యవస్థ స్థంభించిపోయింది.

Published : 24 Feb 2020 22:35 IST

శ్రీనగర్‌ : దాదాపు 7 నెలల సుదీర్ఘ సెలవుల అనంతరం కశ్మీర్‌లో పాఠశాలలు తిరిగి తెరచుకున్నాయి. గత ఆగస్టులో ఆర్టికల్‌ 370 రద్దుతో కశ్మీర్‌లో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా చాలాచోట్ల రవాణా, సమాచార వ్యవస్థ స్తంభించిపోయింది. పరిస్థితులు అనుకూలించాయని భావించిన ప్రభుత్వం గత అక్టోబరులో పాఠశాలు తెరిచింది. కానీ, విద్యార్థులు మాత్రం ఆశించినంతగా పాఠశాలలకు హాజరు కాలేకపోయారు. దీంతో ప్రభుత్వం మూడునెలల పాటు శీతకాల సెలవులు ప్రకటించింది. సెలవుల అనంతరం పాఠశాలలు పూర్తిస్థాయిలో సోమవారం నుంచి తెరుచుకున్నాయి. దీంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులతో రోడ్లన్నీ రద్దీగా కనిపించాయి. తమ స్నేహితులను, ఉపాధ్యాయులను చాలారోజుల తర్వాత కలుసుకోవడంపై ఆనందం వ్యక్తంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని