ట్రంప్‌తో విందుకు మన్మోహన్‌ దూరం

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మంగళవారం ఇవ్వనున్న మర్యాద పూర్వక విందుకు హాజరయ్యేందుకు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సోమవారం నిరాకరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటన నేపథ్యంలో రాష్ట్రపతి కోవింద్‌ మర్యాదపూర్వకంగా ఇవ్వనున్న విందుకు పలువురు ప్రముఖుల్ని ఆహ్వానించిన విషయం తెలిసిందే.

Published : 24 Feb 2020 20:46 IST

దిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో విందుకు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నిరాకరించినట్లు సమాచారం. ట్రంప్‌ భారత పర్యటన నేపథ్యంలో రాష్ట్రపతి కోవింద్‌ మంగళవారం రాత్రి మర్యాదపూర్వకంగా ఇవ్వనున్న విందుకు పలువురు ప్రముఖుల్ని ఆహ్వానించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ సహా పలువురు కాంగ్రెస్‌ నేతలకు ఆహ్వానం పంపారు. అయితే ఈ విందుకు హాజరయ్యేందుకు మన్మోహన్‌ తొలుత అంగీకరించినప్పటికీ తర్వాత మనసు మార్చుకున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. మరోవైపు సింగ్‌తో పాటు రాజ్యసభలో ప్రతిపక్షనేత గులాం నభీ అజాద్‌ సైతం ఈ విందుకు నో చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీ అధినాయకురాలు సోనియాకు విందుకు ఆహ్వానం రాకపోవడంపై అంసతృప్తి వ్యక్తం చేస్తూ విందుకు హాజరవ్వడం లేదని లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరీ ఇప్పటికే స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని