Published : 29/02/2020 16:38 IST

విమానంలో పావురాలు హల్‌చల్‌..!

అహ్మదాబాద్‌:  విమానాలకు అప్పుడప్పుడు పక్షులు అడ్డురావడం సాధారణమే. అయితే తాజాగా ఓ విమానంలోకి రెండు పావురాలు వచ్చి హల్‌చల్‌ చేసిన ఘటన అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. తాజాగా అహ్మదాబాద్‌ నుంచి జైపూర్‌ వెళ్ళే గోఎయిర్‌ విమానం టేకాఫ్‌ కోసం సిద్ధమయ్యింది. అప్పటికే ప్రయాణికులందరూ తమ తమ సీట్లలో కూర్చోగా, ఓ ప్రయాణికుడు తన బ్యాగు ఉంచేందుకు పైన ఉన్న లగేజీ క్యాబిన్‌ను తెరిచాడు. అందులోనుంచి రెండు పావురాలు ఒక్కసారిగా వచ్చాయి. టేకాఫ్‌కు సిద్దంగా ఉన్న సమయంలో ఆ రెండు పావురాలు విమానంలోనే అటూ ఇటూ చక్కర్లు కొట్టడం ప్రారంభించాయి. విమాన సిబ్బందితో పాటు ప్రయాణికులు వీటిని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ వారికి దొరకకుండా హడావుడి చేశాయి. పావురాల అల్లరి చూస్తూన్న కొందరు ప్రయాణికులు వీడియోలు తీయగా, మరికొందరు మాత్రం వాటికి కూడా బోర్డింగ్‌ పాస్‌ ఇవ్వాలంటూ చలోక్తులు విసిరారు. చివరకు విమాన సిబ్బంది ఆ రెండు పావురాలను బయటికి పంపించివేయడంతో ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం దాదాపు 30నిమిషాల ఆలస్యంగా విమానం బయలుదేరింది. ఓ ప్రయాణికుడు ఈ వీడియోని ట్విటర్‌లో పోస్టు చేయడంతో ప్రస్తుతం సామాజిక మాథ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని