ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చులివే!

భారత ప్రధాని నరేంద్రమోదీ గత ఐదేళ్ల కాలంలో చేసిన విదేశీ పర్యటనల ఖర్చుల వివరాల్ని కేంద్ర విదేశాంగ శాఖ బుధవారం వెల్లడించింది. గత ఐదేళ్లలో ఆయన పర్యటనలకు దాదాపు రూ.446.52 కోట్లు ఖర్చు అయినట్లు తెలిపింది.

Published : 05 Mar 2020 00:26 IST

దిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోదీ గత ఐదేళ్ల కాలంలో చేసిన విదేశీ పర్యటనల ఖర్చుల వివరాల్ని కేంద్ర విదేశాంగ శాఖ బుధవారం వెల్లడించింది. గత ఐదేళ్లలో ఆయన పర్యటనలకు దాదాపు రూ.446.52 కోట్లు ఖర్చు అయినట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి వీ మురళీధరన్‌ లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. మంత్రి స్పందిస్తూ.. గత ఐదేళ్లలో మోదీ విదేశీ పర్యటనలకు రూ.446.52 కోట్లు ఖర్చయినట్లు తెలిపారు. వరుసగా ఐదేళ్లలో ఏ ఏడాది ఎంత ఖర్చు చేశారనే విషయాన్ని కూడా వెల్లడించారు. ఈ ఖర్చు మొత్తం విమానాల ఛార్జీలతో కలుపుకుని అని చెప్పారు. ఆయన ఇచ్చిన సమాచారం ప్రకారం.. ప్రధాని పర్యటనలకు 2015-16 సంవత్సరానికి గానూ రూ.121.85 కోట్లు, 2016-17 సంవత్సరానికి గానూ రూ.72.52 కోట్లు, 2017-18కి గానూ రూ.99.90 కోట్లు, 2018-19కి గానూ రూ.100.02 కోట్లు, 2019-20 కి గానూ రూ.46.23 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని