Published : 09/03/2020 15:12 IST

క్షేమంగానే సౌదీ రాజు సల్మాన్‌..!

 

రియాద్‌: సౌదీఅరేబియా రాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ పూర్తి ఆరోగ్యంగానే ఉన్నట్లు సౌదీ రాయల్‌ కోర్టు వెల్లడించింది. సల్మాన్‌ మరణించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంటూ సల్మాన్‌ తాజా ఫోటోలను విడుదల చేసింది. అతను ఆరోగ్యంగా ఉంటూ రోజూవారీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలిపింది. అదే రాజకుటుంబానికి చెందిన రాజకుమారుడి అరెస్టుతో సల్మాన్‌ ఆరోగ్యం క్షీణించిందనే పుకార్లు వచ్చాయి. అయితే తండ్రి మద్దతుతో కీలక బాధ్యతలు చేపట్టిన రాజకుమారుడు, సన్నిహితులు మాత్రం సల్మాన్‌కు మద్దతు తెలపకపోవడంతో పాటు తిరుగుబాటుకు యత్నిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈనేపథ్యంలోనే సల్మాన్‌ కుమారుడితోపాటు మరో ఇద్దరిని రాజద్రోహం కింద అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇలా రాజకుటుంబంలోని వారితోపాటు రాజుకు అత్యంత సన్నిహితులను కూడా అరెస్టు చేయడం ద్వారా ఎవరైనా తప్పుచేస్తే అధికారం కోల్పోవాల్సివస్తుందనే సంకేతాలను రాజకుటుంబం పంపింది.

అయితే ఈ సమయంలోనే 84ఏళ్ల వయసున్న సౌదీ రాజు సల్మాన్ ఆరోగ్యంపై పలు వార్తలు వస్తున్నాయి. వీటిని ఖండించిన రాయల్‌ కోర్టు.. సల్మాన్‌ పూర్తి ఆరోగ్యంగా ఉంటూ రోజూవారీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారని స్పష్టం చేసింది. తాజాగా రాజు సల్మాన్‌ అధికారికంగా ఇద్దరు దౌత్య అధికారులను కలుసుకున్న ఫోటోలను విడుదల చేసింది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని