సమాంతర ప్రభుత్వ ఏర్పాటును అంగీకరించం

అఫ్గానిస్థాన్‌లో సమాంతర ప్రభుత్వ ఏర్పాటును అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో అన్నారు. ఏకీకృత, సార్వభౌమాధికార అఫ్గాన్‌ను అమెరికా సమర్థిస్తుందని.....

Published : 10 Mar 2020 15:35 IST

వాషింగ్టన్‌: అఫ్గానిస్థాన్‌లో సమాంతర ప్రభుత్వ ఏర్పాటును అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో అన్నారు. ఏకీకృత, సార్వభౌమాధికార అఫ్గాన్‌ను అమెరికా సమర్థిస్తుందని స్పష్టంచేశారు. దీనిపై పాంపియో మాట్లాడుతూ‘‘ రాజకీయ విభేదాలు పరిష్కరించుకోవడానికి, సమాంతర ప్రభుత్వ ఏర్పాటుకు బలగాలను ప్రయోగించడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అమెరికా-తాలిబన్ల మధ్య ఒప్పందం, అమెరికా-అఫ్గానిస్థాన్‌ ఉమ్మడి ప్రకటన చారిత్రక అవకాశాలను సృష్టిస్తాయి. సమగ్ర ప్రభుత్వ ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వడం అఫ్గాన్‌ దేశ భవిష్యత్తుకు, శాంతి స్థాపనకు ఎంతో ముఖ్యమైనది’’ అని పేర్కొన్నారు.

అఫ్గానిస్థాన్‌లో సోమవారం కేవలం నిమిషాల వ్యవధిలో అధ్యక్షుడు అష్రాప్‌ ఘనీ, ఆయన మాజీ సీఈవో అబ్దుల్లాలు అధ్యక్షులుగా ప్రమాణం చేసిన నేపథ్యంలో అమెరికా ఈ వ్యాఖ్యలు చేసింది. అయితే ఘనీ అధ్యక్షుడిగా ప్రమాణం చేస్తున్న సమయంలో అక్కడికి సమీపంలో పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లను అమెరికా తీవ్రంగా ఖండించింది. దేశాన్ని ఏకీకృతం చేసి, శాంతి స్థాపన కోసం కృషి చేసే ప్రభుత్వ ఏర్పాటుకు రాబోయే రెండు వారాల్లో  చర్చలు కొనసాగుతాయని అఫ్గాన్‌ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ ప్రకటించడాన్ని అమెరికా స్వాగతించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు