గూగుల్‌ ఉద్యోగికి కరోనా..!

బెంగళూరు: ప్రపంచవ్యాప్తంగా వణికిస్తోన్న కరోనా వైరస్‌ ప్రస్తుతం మన దేశంలోనూ విజృంభిస్తోంది. ప్రస్తుతం దేశంలో కొవిడ్‌-19 బారినపడుతున్న వారిసంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా బెంగళూరులోని గూగుల్‌ కార్యాలయంలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి కరోనా నిర్ధారణ అయ్యింది. 

Updated : 06 Jul 2021 18:57 IST

బెంగళూరు: ప్రపంచవ్యాప్తంగా వణికిస్తోన్న కరోనా వైరస్‌ ప్రస్తుతం మన దేశంలోనూ విజృంభిస్తోంది. ప్రస్తుతం దేశంలో కొవిడ్‌-19 బారినపడుతున్న వారిసంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా బెంగళూరులోని గూగుల్‌ కార్యాలయంలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి కరోనా నిర్ధారణ అయ్యింది. తమ కంపెనీ ఉద్యోగికి కొవిడ్‌-19 నిర్ధారణ అయినట్లు గూగుల్‌ స్వయంగా వెల్లడించింది. వెంటనే అతన్ని ప్రత్యేక పరిశీలనలో ఉంచినట్లు పేర్కొంది. అంతేకాకుండా అతనితో సన్నిహితంగా ఉన్న ఉద్యోగులను ఇంటికే పరిమితం కావాలని, ఏదైనా అనారోగ్యానికి గురైతే వారుకూడా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించినట్లు తెలిపింది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా తమ కంపెనీ ఉద్యోగులను ఇంటివద్ద నుంచే పనిచేయాలని సూచించింది. ఇప్పటికే అమెరికా, యూరప్‌ కార్యాలయాల్లోని తమ ఉద్యోగులను ఇంటినుంచే పనిచేసేలా చర్యలు చేపట్టింది. తాజాగా బెంగళూరు కార్యాలయ ఉద్యోగులు కూడా ఇంటినుంచే పనిచేయాలని తెలిపింది. 

ఇదిలాఉంటే, దేశంలో ఇప్పటికే దాదాపు 75 కొవిడ్‌-19 కేసులు నమోదుకాగా ఓ వ్యక్తి మరణించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు దేశంలోని పలు విమానాశ్రయాల్లో దాదాపు 11లక్షల 14వేల మంది ప్రయాణికులకు స్క్రీనింగ్‌ నిర్వహించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని