Updated : 18/03/2020 01:14 IST

వైరల్‌గా మారిన ‘కరోనా’ వస్త్ర దుకాణం!

కొచ్చి: కేరళలోని ఓ వస్త్ర దుకాణం ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ దుకాణం పేరే దానికి అంత పబ్లిసిటీ తెచ్చిపెట్టింది. ఇంతకీ ఆ దుకాణం పేరేంటని ఆశ్చర్యపోతున్నారా. అది అందరికీ సుపరిచితమే.. ప్రస్తుతం ప్రపంచ దేశాలను కూడా వణికిస్తోంది. అదే మహమ్మారి కరోనా వైరస్‌. దుకాణం పేరు కూడా అదే కావడం విశేషం. ఈ కరోనా దుకాణం కేరళలోని కొచ్చికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఫరీద్ అనే వ్యక్తి ఈ కరోనా వస్త్ర దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. దాదాపు కొన్నేళ్లుగా ఆయన దీన్ని నడుపుతుండడంతో ఆయన పేరు కూడా ‘కరోనా ఫరీద్‌’గా మారడం విశేషం. 

ఈ సందర్భంగా ఫరీద్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం చాలా మంది నా దుకాణం ముందు వెళ్తూ ఆగి మరీ చూసి వెళ్తున్నారు. ఇంకొందరు దుకాణం ముందు సెల్ఫీలు సైతం దిగుతున్నారు’ అని చెప్పారు. ఈ పేరును తాను ఎలా ఎంపిక చేసుకున్నావు అని ప్రశ్నించగా.. డిక్షనరీలో చూసి వెతికి ఈ పేరును ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు. కాగా కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా ఆయన తన దుకాణంలో శానిటైజర్స్‌ ఉంచినట్లు తెలిపారు. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్