లోక్‌సభ నిరవధిక వాయిదా

బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా సమావేశమైన లోక్‌సభ నిరవధిక వాయిదా పడింది. ఆర్థిక బిల్లుకు ఆమోదం అనంతరం దిగువ సభను వాయిదా వేశారు. కీలకమైన ఆర్థిక బిల్లుపై....

Updated : 23 Mar 2020 19:21 IST

దిల్లీ: లోక్‌సభ నిరవధిక వాయిదా పడింది. ఆర్థిక బిల్లుకు ఆమోదం అనంతరం దిగువ సభను వాయిదా వేశారు. కీలకమైన ఆర్థిక బిల్లుపై ఎలాంటి చర్చా జరగకుండానే కేవలం మూజువాణి ఓటు ద్వారా ఆమోదం తెలిపారు. అనంతరం సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. బడ్జెట్‌ సమావేశాలు రెండు విడతల్లో జరిగిన సంగతి తెలిసిందే. రెండో విడత సమావేశాలు ఏప్రిల్‌ 3 వరకు జరగాల్సి ఉండగా.. కరోనా వైరస్‌ నేపథ్యంలో సమావేశాలను కుదించారు. రాజ్యసభ కూడా పలు అంశాలపై చర్చ అనంతరం ఇవాళ వాయిదా పడనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని