దానిబట్టే అంతర్జాతీయ విమానాలకు అనుమతి

పరిస్థితులను అనుసరించి, ఏ దేశాల నుంచి వస్తున్నాయో తెలుసుకొని లాక్‌డౌన్‌ తర్వాత విమానాలకు అనుమతిస్తామని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి తెలిపారు. విదేశాల్లో ఎదురు చూస్తున్న.......

Updated : 02 Apr 2020 21:57 IST

దిల్లీ: పరిస్థితులను అనుసరించి, ఏ దేశాల నుంచి వస్తున్నాయో తెలుసుకొని లాక్‌డౌన్‌ తర్వాత విమానాలకు అనుమతిస్తామని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి తెలిపారు. విదేశాల్లో ఎదురు చూస్తున్న భారతీయులు ఏప్రిల్‌ 15 వరకు ఆగాల్సిందేనని స్పష్టం చేశారు. భారత్‌ నుంచి విదేశీయులను తీసుకెళ్లే విమానాలు తిరిగొచ్చేటప్పుడు ఎవరినీ తీసుకురావని ఆయన వెల్లడించారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశం లేదని ప్రధాని నరేంద్రమోదీ సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.

లాక్‌డౌన్‌ సమయంలో భారత్‌లో చిక్కుకుపోయిన తమ పౌరులను తీసుకెళ్లేందుకు అమెరికా, బ్రిటన్‌, జర్మనీ ప్రత్యేక విమానాలను కేంద్రం అనుమతినిచ్చింది. వారిని తీసుకెళ్లేందుకు ఎయిర్‌ ఇండియా ఒప్పందం కుదుర్చుకుందని సంస్థ అధినేత రాజీవ్‌ బన్సల్‌ తెలిపారు. ‘భారత్‌ తమ పౌరులను తిరిగి పంపించేలా దిల్లీలోని అమెరికా, బ్రిటన్‌, జర్మనీ దౌత్య కార్యాలయాలు సహాయం కోరాయి. కొన్ని విమానాలు ఏర్పాటు చేయాలని అడిగాయి. వాణిజ్య పరిమితుల మేరకు ఈ నాలుగు దేశాలకు 18 ఛార్టర్‌ విమానాలు ఏర్పాటు చేస్తారు. విదేశీయులను తీసుకెళ్లిన ఈ విమానాల్లో తిరిగి ఎవరినీ తీసుకురారు’ అని రాజీవ్‌ వెల్లడించారు. లాక్‌డౌన్‌ కోసం మార్చి 24న దేశీయ, 21న అంతర్జాతీయ విమానాలను కేంద్రం నిలిపివేసింది. అయితే వాణిజ్య విమానాలు మాత్రం కొనసాగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని