నిత్యావసరాలపై జాగ్రత్తలు తీసుకోండి 

నల్లబజార్లలతో నిత్యావసరాల అక్రమ నిల్వలు, ధరలు పెంచడం వంటి కార్యక్రమాలు ఎక్కువయ్యే అవకాశాలున్నాయని.. ఇందుకోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ.. 

Published : 08 Apr 2020 19:54 IST

రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి లేఖ 

దిల్లీ: నల్లబజార్లలతో నిత్యావసరాల అక్రమ నిల్వలు, ధరలు పెంచడం వంటి కార్యక్రమాలు ఎక్కువయ్యే అవకాశాలున్నాయని.. ఇందుకోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. డీలర్లపై నిఘా పెంచడంతోపాటు వారి అకౌంట్లను నిత్యం పరిశీలించాలన్నారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని.. దీనికిగానూ ఏడేళ్ల జైలు శిక్ష ఉన్నట్లు గుర్తు చేశారు. జూన్‌ 30 వరకు నిత్యావసరాల చట్టం అమలులో ఉంటుందని.. ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టంగా ప్రచారం చేయాలన్నారు. ఆహార, నిత్యావసర ఉత్పత్తి సంస్థల్లోని కార్మికుల కొరత, ముడి సరకు సరఫరాపై దృష్టి సారించాలని కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని