హెచ్‌1బీ వీసాల పరిమితి పొడిగించాలి

అమెరికాలో ఉపాధి పొందుతున్న భారతీయుల హెచ్‌1బీ, ఇతర వీసాల గడువు పరిమితిని పొడిగించాలని అమెరికాకు భారత్‌  విజ్ఞప్తి చేసింది. కరోనా కల్లోలం నేపథ్యంలో......

Updated : 11 Apr 2020 17:49 IST

అగ్రరాజ్యానికి భారత్‌ విజ్ఞప్తి

న్యూదిల్లీ: అమెరికాలో ఉపాధి పొందుతున్న భారతీయుల హెచ్‌1బీ, ఇతర వీసాల గడువు పరిమితిని పొడిగించాలని అమెరికాకు భారత్‌  విజ్ఞప్తి చేసింది. కరోనా కల్లోలం నేపథ్యంలో హెచ్‌1బీ వీసాదారుల విధులను నిలిపివేయాలని అక్కడి ప్రభుత్వం ఆయా యాజమాన్యాలను ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. అయితే అమెరికా ప్రభుత్వం అలాంటి ఆదేశాలేవి జారీ చేయలేదని మన దేశానికి చెందిన ఓ ఉన్నతాధికారి మీడియాకు స్పష్టం చేశారు. విదేశీ వ్యవహారాల కార్యదర్శి హర్షవర్ధన్‌ ష్రింగ్లా ఈ విషయమై అక్కడి ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు చెప్పారు. సదరు ఉద్యోగులను యథావిధిగా కొనసాగించాలని కోరినట్లు ఆయన వెల్లడించారు.

* మూడు లక్షల మంది భారతీయులు..
ప్రస్తుతం మన దేశానికి చెందిన దాదాపు మూడు లక్షలకు పైగా  హెచ్‌1బీ వీసాదారులు  అమెరికాలో  ఉపాధి పొందుతున్నారు. ఒకవేళ యూఎస్‌లో ఉన్న హెచ్‌1బీ ఉద్యోగితో కుదుర్చుకున్న ఒప్పందాన్ని సంబంధిత సంస్థ రద్దు చేసుకుంటే సదరు వ్యక్తి 60 రోజుల్లోనే మరో ఉద్యోగం వెతుక్కోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో హెచ్‌1బీ వీసా రద్దవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని