నాలుగు నెలల కనిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం

మార్చి నెలలో టోకు ధరల ఆధారిత ద్రల్యోల్బణం(డబ్ల్యూపీఐ) నాలుగు నెలల కనిష్ఠానికి చేరింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం బుధవారం గణాంకాలు వెల్లడించింది. ఫిబ్రవరిలో 2.26 శాతంగా ఉన్న ఈ సూచీ....

Published : 15 Apr 2020 15:15 IST

దిల్లీ: మార్చి నెలలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) నాలుగు నెలల కనిష్ఠానికి చేరింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం బుధవారం గణాంకాలు విడుదల చేసింది. ఫిబ్రవరిలో 2.26 శాతంగా ఉన్న ఈ సూచీ మార్చిలో 1శాతానికి చేరినట్లు తెలిపింది. గత నెలలో ఆహార పదార్థాల ధరలు పడిపోవడమే దీనికి కారణమని స్పష్టం చేసింది. ఇక ఫిబ్రవరిలో 7.79గా ఉన్న ఆహార ద్రవ్యోల్బణ సూచీ మార్చిలో 4.91కి చేరిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ వెల్లడించింది. కూరగాయాల ద్రవ్యోల్బణం 29.97 నుంచి 11.90కు పడిపోయింది. అయితే ఉల్లి ద్రవ్యోల్బణం మాత్రం 112.31శాతంగా కొనసాగుతోందని వెల్లడించింది. మార్చి 23 నుంచి అమల్లోకి వచ్చిన లాక్‌డౌన్‌ ప్రభావం ఈ గణాంకాల కోసం సేకరించిన సమాచారంపై పడిందని వివరించింది.

 

ఇవీ చదవండి...
ఇష్టానుసారం కరెన్సీ నోట్లు ముద్రించలేం

భారత్‌ జీడీపీ 1.9 శాతమే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని