స్వదేశానికి 41 మంది పాకిస్థానీయులు

లాక్‌డౌన్‌ నేపథ్యంలో భారత్‌లో చిక్కుకుపోయిన 41 మంది పాకిస్థానీయులు స్వదేశానికి చేరుకున్నారు. అధికారుల సమక్షంలో గురువారం వారు వాఘా- అటారీ క్రాసింగ్‌ వద్ద పాక్‌లోకి ప్రవేశించారు. ఈ విషయాన్ని పాకిస్థాన్‌ హైకమిషన్‌ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

Published : 17 Apr 2020 01:20 IST

వాఘా- అటారీ క్రాసింగ్‌ వద్ద పాక్‌లోకి ప్రవేశం

న్యూదిల్లీ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో భారత్‌లో చిక్కుకుపోయిన 41 మంది పాకిస్థానీయులు స్వదేశానికి చేరుకున్నారు. అధికారుల సమక్షంలో గురువారం వారు వాఘా- అటారీ క్రాసింగ్‌ వద్ద పాక్‌లోకి ప్రవేశించారు. ఈ విషయాన్ని పాకిస్థాన్‌ హైకమిషన్‌ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. కరోనా మహమ్మారి కట్టడి చర్యల్లో భాగంగా భారత్‌ తన సరిహద్దులను మూసివేసిన విషయం తెలిసిందే. వైద్యం, ఇతరత్రా పనులపై ఇండియాకి వచ్చిన వీరంతా లాక్‌డౌన్‌ కారణంగా ఆగ్రా, హరియాణా, పంజాబ్‌, దిల్లీ తదితర ప్రాంతాల్లో ఉండిపోయారు. వారిని వీలైనంత త్వరగా రప్పించేందుకు భారత ప్రభుత్వం, సదరు వ్యక్తుల కుటుంబాలతో పాక్‌ హైకమిషన్‌ సమన్వయం చేసుకుంది. ‘పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ పర్యవేక్షణలో, విదేశాంగ కార్యాలయం మార్గదర్శకత్వంలో పొరుగు దేశంలో చిక్కుకున్న పాకిస్థానీయులను సురక్షితంగా, సజావుగా తిరిగి తీసుకురావడానికి ప్రాధాన్యం ఇచ్చామ’ని హైకమిషన్ ఒక ప్రకటనలో పేర్కొంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆయా జాతీయులను వారివారి దేశాలకు తరలించేలా భారత విదేశాంగ మంత్రిత్వశాఖ చర్యలు చేపడుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని