Published : 16/04/2020 20:39 IST

WHOకు నిధులు ఎలా వస్తాయ్‌?

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా వైరస్‌ విషయంలో చైనాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వత్తాసు పలుకుతోందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఆ సంస్థకు నిధులు పూర్తిగా నిలిపివేశారు. డబ్ల్యూహెచ్‌వోకు ఏటా తాము దాదాపు రూ.3,833 కోట్ల వరకు నిధులు సమకూరుస్తుంటే.. చైనా కేవలం రూ.300 కోట్లు మాత్రమే ఇస్తోందని ట్రంప్‌ పేర్కొన్నారు. ఇంతకీ డబ్ల్యూహెచ్‌వోకు ఎలా వస్తాయ్‌? ఏయే దేశాల భాగస్వామ్యం ఎంత?

చైనా కంటే మనమే అధికం..
ట్రంప్‌ చెప్పినట్లు డబ్ల్యూహెచ్‌వోకు పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చేది అమెరికానే. ఈ సంస్థకు సమకూరే నిధుల్లో అమెరికా వాటా 14.67 శాతం. ఆ స్థాయిలో బిల్‌గేట్స్‌కు చెందిన బిల్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ 9.76 శాతం నిధులు అందిస్తోంది. జెనీవా కేంద్రంగా పబ్లిక్‌, ప్రైవేటు భాగస్వామ్యంతో పనిచేసే ‘గవి’ అలయన్స్‌ 8.39 శాతం నిధులు అందిస్తోంది. ఈ సంస్థకు బిల్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ పెద్ద మొత్తంలో నిధులు సమకూరుస్తుండడం గమనార్హం. ఆ తర్వాత యూకే (7.79 శాతం), జర్మనీ (5.68 శాతం) పెద్ద మొత్తంలో నిధులు అందిస్తున్నాయి. ఐరాస కో-ఆర్డినేషన్ ఫర్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ (5 శాతం), ప్రపంచ బ్యాంకు (3.42 శాతం) రోటరీ ఇంటర్నేషనల్‌ (3.3 శాతం), యూరోపియన్‌ కమిషన్‌ (3.3 శాతం), జపాన్‌ (2.7 శాతం) చొప్పున డబ్ల్యూహెచ్‌వోకు పెద్ద మొత్తంలో నిధులు సమకూరుస్తుండడం గమనార్హం. ట్రంప్‌ చెప్పినట్లు డబ్ల్యూహెచ్‌వోకు చైనా సాయం నామమాత్రమే. మొత్తం నిధుల్లో ఆ దేశం కేవలం 0.21 శాతం మాత్రమే ఇస్తోంది. అదే సమయంలో భారత్‌ 0.48 శాతం, పాకిస్థాన్‌ 0.36 శాతం చొప్పున నిధులు ఇస్తుండడం గమనార్హం. ఫ్రాన్స్‌ 0.5 శాతం నిధులు అందిస్తోంది. 

నిధులు ఇలా..
డబ్ల్యూహెచ్‌వోరే వాలంటరీగా సమకూరే నిధులే అధికం. మొత్తం నిధుల్లో 80 శాతం ఈ విధంగా వచ్చేవే. డబ్ల్యూహెచ్‌వోలో సభ్య దేశాలైన 194, ఎన్జీవోలు ఈ నిధులను అందిస్తున్నాయి. అయితే, ఇవి రెండు రకాలుగా ఉంటాయి. సంస్థ తన అవసరాలు, ప్రాధాన్య అంశాలకు ఖర్చు చేయడానికి వినియోగించే నిధులను కోర్‌ వాలంటరీ కంట్రిబ్యూషన్‌ అంటారు. ప్రత్యేకించి ఒకదానిపై మాత్రమే ఖర్చు చేయడానికి వీలుండే నిధులను స్పెసిఫైడ్‌ వాలంటరీ కంట్రిబ్యూషన్‌గా పేర్కొంటారు. డబ్ల్యూహెచ్‌వోలో సభ్యత్వానికి గానూ చెల్లించే ఫీజును అసెస్డ్‌ కంట్రిబ్యూషన్‌ అంటారు. ఈ మొత్తం 17 శాతంగా ఉంటుంది. అయితే, ఒక్కోదేశానికి ఒక్కోలా ఉంటుంది. ఒక్క అమెరికానే దాదాపు 15 శాతం నిధులు సమకూరుస్తుండడం గమనార్హం. ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ల కట్టడికి కోసం ఏర్పాటు చేసిన పాండమిక్‌ ఇన్‌ఫ్లూయెంజా ప్రిపేర్డ్‌నెస్‌ కింద మరో 3 శాతం వరకు నిధులు డబ్ల్యూహెచ్‌వోకు అందుతాయి.

ఇదీ చదవండి..

అన్నంత పనీ చేసిన ట్రంప్‌.. డబ్ల్యూహెచ్‌వోకు నిధులు బంద్‌

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని