వ్యాక్సిన్ అభివృద్ధిలో భారత్‌తో కలిసి ముందుకు..!

కరోనా వైరస్‌పై జరుగుతున్న పోరులో అమెరికా భారత్‌తో కలిసి పనిచేస్తుందని అమెరికా మరోసారి స్పష్టంచేసింది. వైద్య విధానం, వ్యాక్సిన్‌ అభివృద్ధిలో ఇరు దేశాలు సహకరించుకుంటాయని అమెరికా విదేశాంగమంత్రి మైక్‌ పాంపియో అభిప్రాయపడ్డారు.

Published : 17 Apr 2020 13:46 IST

ఎదురయ్యే సవాళ్లపై కలిసి పోరాడుతామన్న అమెరికా

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌పై పోరులో భారత్‌తో కలిసి పనిచేస్తామని అమెరికా మరోసారి స్పష్టంచేసింది. వైద్య విధానం, వ్యాక్సిన్‌ అభివృద్ధిలో ఇరు దేశాలు సహకరించుకుంటాయని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిముఖ్యమైన సమస్యలపై చర్చలతోపాటు.. సమీప భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లపై ఇరుదేశాల మధ్య సహకారం కొనసాగుతుందని తెలిపారు. వ్యక్తిగత పరిరక్షణ పరికరాలతో పాటు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ వంటి వాటికి అవరోధం లేదని పాంపియో విలేకరులతో జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. ఇరు దేశాల జాతీయ భద్రతకు సంబంధించిన ప్రాధాన్యత అవసరాల సరఫరాపై దృష్టి సారించామన్నారు.

ఇదిలా ఉంటే, అమెరికాలో కరోనావైరస్‌ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. అమెరికావ్యాప్తంగా ఈ వైరస్‌తో ఇప్పటివరకూ 34 వేల మంది మృత్యువాతపడ్డారు. గడచిన 24గంటల్లో అక్కడ 4491 మరణాలు సంభవించాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇవీ చదవండి..

అమెరికాలో కరోనా కరాళనృత్యం..

చైనాపై అనుమానం నిజమేనా?..

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని