అది నేను చెప్పింది కాదు: రతన్‌ టాటా

కరోనా నేపథ్యంలో తనకు ఆపాదిస్తూ వచ్చిన నకిలీ వార్తపై ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్‌ టాటా స్పందించారు.

Published : 05 May 2020 00:56 IST

ముంబయి: కరోనా నేపథ్యంలో తనకు ఆపాదిస్తూ వచ్చిన నకిలీ వార్తపై ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్‌ టాటా స్పందించారు. ట్విటర్‌ వేదిక ఆ వార్తా కథనాన్ని షేర్ చేస్తూ ఈ విషయం తాను చెప్పలేదని పేర్కొన్నారు. ‘రతన్‌ టాటాస్‌ మెసేజ్‌: 2020 ఈజ్‌ ద ఇయర్‌ ఆఫ్ సర్వైవల్‌, డోంట్ వర్రీ ఎబౌట్ ప్రాఫిట్ అండ్ లాస్‌’ శీర్షికన ఓ కథనం వెలువడింది. అందులో రతన్‌ టాటా ఫొటో కూడా ఉంది. దీనిపై రతన్‌ టాటా స్పందిస్తూ ఈ కథనంతో తనకు సంబంధం లేదని పేర్కొన్నారు. తన పేరిట నకిలీ వార్తలు వస్తుండడంపై అసహనం వ్యక్తంచేశారు. గతంలో కూడా ఆయన ఓ వార్తా కథనంపై ఆయన ఇదే విధంగా స్పష్టత ఇవ్వాల్సి వచ్చింది. కరోనా ప్రభావంతో భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లనుందని నిపుణులు భావిస్తున్నారని ఆయన చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దాన్ని ఆయన ఖండించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని