విదేశాంగ శాఖలో ఇద్దరికి కరోనా

దేశ రాజధాని దిల్లీలోని విదేశాంగ శాఖ కార్యాలయంలో కరోనా కలకలం రేగింది. కార్యాలయంలోని ఇద్దరికి కరోనా పాజిటివ్‌ తేలడంతో ఆయా విభాగాల్లో పనిచేసే సిబ్బందిని సెల్ఫ్‌....

Published : 30 May 2020 17:25 IST

క్వారంటైన్‌లోకి తోటి సిబ్బంది

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని విదేశాంగ శాఖ కార్యాలయంలో కరోనా కలకలం రేగింది. కార్యాలయంలోని ఇద్దరికి కరోనా పాజిటివ్‌ తేలడంతో ఆయా విభాగాల్లో పనిచేసే సిబ్బందిని సెల్ఫ్‌ క్వారంటైన్‌ వెళ్లాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలిసింది. విదేశాంగ శాఖ కార్యాలయంలోని లీగల్‌ విభాగంలో పనిచేసే ఒకరితో పాటు, సెంట్రల్‌ యూరప్‌ డివిజన్‌లో కన్సల్టెంట్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. దీంతో ఆ రెండు విభాగాల్లో పనిచేసే సిబ్బందిని 14 రోజుల క్వారంటైన్‌కు వెళ్లాలని ఉన్నతాధికారులు సూచించారు. దీంతో పాటు ఆయా కార్యాలయాల్లో శానిటైజేషన్‌ చేపట్టారు.

ఇద్దరు ఉద్యోగులకు కరోనా సోకిన నేపథ్యంలో విదేశాంగ శాఖ ఉద్యోగులందరికీ అంతర్గత సమాచారం చేరవేసింది. ఉద్యోగులందరూ కొవిడ్‌-19 నిబంధనలు పాటించాలని సూచించింది. విదేశాల్లో చిక్కుకున్న వేలాది మందిని స్వదేశానికి తరలించేందుకు భారత్‌ చేపట్టిన ‘వందే భారత్‌ మిషన్‌’లో ఉద్యోగులంతా తలమునకలైన వేళ రెండు పాజిటివ్‌ కేసులు వెలుగు చూడడం గమనార్హం. ఇప్పటికే 50 వేల మందిని విదేశాంగ శాఖ ఈ కార్యక్రమ ద్వారా స్వదేశానికి తీసుకురాగా.. జూన్‌ 13 నాటికి మరో లక్ష మందిని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. దీంతో విదేశాంగ శఖ కార్యాలయంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని