మహారాష్ట్ర పాలన సర్కస్‌ను తలపిస్తోంది 

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ శివసేన ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కరోనా కట్టడికి మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం మహారాష్ట్ర భాజపా కార్యకర్తల వర్చువల్‌ ర్యాలీలో

Updated : 09 Jun 2020 23:18 IST

రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యలపై కేంద్రమంత్రి  రాజ్‌నాథ్‌సింగ్‌ అసంతృప్తి

ముంబయి: కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ శివసేన ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కరోనా కట్టడికి మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం మహారాష్ట్ర భాజపా కార్యకర్తల వర్చువల్‌ ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులు చూస్తుంటే శివసేన ప్రభుత్వం పరిపాలన చేస్తుందా.. లేదా సర్కస్‌ నడుపుతోందా అన్నట్లు ఉందన్నారు. వలస కార్మికులను స్వస్థలాలకు పంపుతున్న బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌పై రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు చేయడంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అతను చేస్తున్న పనికి ప్రశంసించాల్సింది పోయి విమర్శలు చేయడం బాధాకరమన్నారు. పేదలు, వలస కూలీలకు సోనూసూద్‌ చేస్తున్న సాయాన్ని భాజపా ఆడిస్తున్న డ్రామాగా శివసేన ప్రభుత్వం పేర్కొనడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో కరోనా బారిన పడ్డవారు ఆంబులెన్స్‌ కోసం 16గంటలు వేచిచూడాల్సి వస్తోందని తెలిసి ఆశ్చర్యపోయానన్నారు. ఎన్సీపీ సీనియర్‌ నేత శరద్‌ పవార్‌ లాంటి బలమైన నాయకుడు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా కేసుల నమోదులో మహారాష్ట్ర, చైనాను కూడా దాటిపోయిన విషయం తెలిసిందే. కరోనా కట్టడి విషయంలో ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాలను చూసి మహారాష్ట్ర ప్రభుత్వం ఎంతో నేర్చుకోవాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని