ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ముష్కరుల హతం

కశ్మీర్‌లో ఉగ్రవాదంపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. జమ్మూకశ్మీర్‌లో మంగళవారం వేకువజామున జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం...........

Updated : 16 Jun 2020 10:41 IST

శ్రీగనర్‌: కశ్మీర్‌లో ఉగ్రవాదంపై భద్రతా బలగాలు గత కొన్నిరోజులుగా ఉక్కుపాదం మోపుతున్నాయి. జమ్మూకశ్మీర్‌లో మంగళవారం వేకువజామున జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షోపియాన్‌ జిల్లా తుర్క్‌వాంగమ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు ఈరోజు తెల్లవారుజామున నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా బలగాల కదలికల్ని పసిగట్టిన ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు ముష్కరులు అక్కడికక్కడే మృతిచెందారు. సంఘటనా స్థలంలో రెండు ఏకే-47 తుపాకులు, ఇన్సాస్‌ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతం రాష్ట్రీయ రైఫిల్స్‌ స్థావరానికి కేవలం 400 నుంచి 500 మీటర్ల దూరంలోనే ఉండడం గమనార్హం. గత పది రోజుల వ్యవధిలో ఉగ్రవాదుల ఏరితేతపై ఇది నాలుగో ఆపరేషన్‌. షోపియాన్‌ జిల్లాలో ఈ నెలలో జరిగిన పలు ఎన్‌కౌంటర్లలో ఇప్పటి వరకు 19 మంది ముష్కరులు హతమయ్యారు.

మరోవైపు పాక్‌ సైన్యం తమ వక్రబుద్ధి చాటుకుంటోంది. తంగ్దార్‌ సెక్టార్‌లో సరిహద్దు మీదుగా మంగళవారం ఉదయం కాల్పులకు తెగబడుతోంది. భారత సైన్యం వీటిని దీటుగా తిప్పికొడుతోంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని