6నెలల్లో 94మంది ఉగ్రవాదులు హతం!

జమ్మూ కశ్మీర్‌లో ఈ సంవత్సరం ఇప్పటివరకు దాదాపు 94మంది ఉగ్రవాదులను మట్టుపెట్టినట్టు కశ్మీర్ ఐజీ విజయ్‌ కుమార్‌ వెల్లడించారు. దక్షిణ కశ్మీర్‌లోని షోపియన్‌ జిల్లాలో తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌ జరిగిన అనంతరం ఐజీ ఈ వివరాలు వెల్లడించారు.

Published : 16 Jun 2020 17:53 IST

కశ్మీర్‌ ఐజీ వెల్లడి!

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లో ఈ సంవత్సరం ఇప్పటివరకు దాదాపు 94మంది ఉగ్రవాదులను మట్టుపెట్టినట్టు కశ్మీర్ ఐజీ విజయ్‌ కుమార్‌ వెల్లడించారు. దక్షిణ కశ్మీర్‌లోని షోపియన్‌ జిల్లాలో తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌ జరిగిన అనంతరం ఐజీ ఈ వివరాలు వెల్లడించారు. మంగళవారం జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు స్థానిక ఉగ్రవాదులు హతమయ్యారు. కాగా ఉగ్రవాదుల కదలికలు ఎక్కువగా ఉన్న ఉత్తర కశ్మీర్‌లో కూడా ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.

ఇదిలా ఉంటే, అనంత్‌నాగ్‌లో ఈ నెల 8న ఉగ్రవాదుల చేతిలో స్థానిక సర్పంచ్‌ అజయ్‌ పండిట్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. హిజ్బుల్‌ ముజాహిదీన్‌కు చెందిన ఉగ్రవాది ఉమర్‌ ఈ హత్య చేసినట్లు ప్రత్యక్ష సాక్షుల ప్రకారం తేలిందని విజయ్‌ కుమార్‌ వెల్లడించారు. అయితే ఈ హత్య చేసిన అనుమానిత ఉగ్రవాది ఇప్పటికే భద్రతా దళాల చేతిలో హతమైనట్లు గుర్తించారు. ఈ సమయంలో ప్రాణహాని ఉన్న సర్పంచ్‌లు, రక్షణ కోసం స్థానిక పోలీసులను సంప్రదించాలని పోలీసు ఉన్నతాధికారులు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని