Published : 17/06/2020 19:55 IST

బీజింగ్‌లో మళ్లీ కరోనా: 1200విమానాలు రద్దు 

బీజింగ్‌: చైనా రాజధాని నగరం బీజింగ్‌ను కరోనా మళ్లీ వణికిస్తోంది. తొలి దశలో పూర్తిగా శాంతించినట్లే కనిపించినప్పటికీ మళ్లీ ఈ మహమ్మారి పడగ విప్పుతోంది. బీజింగ్‌ నగరంలో బుధవారం మరో 31 కొత్త కేసులు నమోదవ్వడంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. 1200 విమాన సర్వీసులను రద్దు చేయడంతో పాటు పాఠశాలలను మళ్లీ మూసివేశారు. బీజింగ్‌ను వీడి ఎవరూ బయటకు వెళ్లవద్దని అక్కడి ప్రజలకు సూచిస్తున్నారు. తాజాగా జిన్‌ఫాడీ హోల్‌సేల్‌ ఫుడ్‌ మార్కెట్‌లో ఈ వైరస్‌ ప్రబలినట్టు గుర్తించిన అధికారులు అక్కడి ప్రజలకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజింగ్‌లో దాదాపు 30 ప్రజా సముదాయాల్లో లాక్‌డౌన్ కొనసాగిస్తున్నారు. 

బీజింగ్‌లో చాలా తీవ్రంగా ఉంది!

ఈ పరిస్థితుల్లో బీజింగ్‌లోని దాదాపు అన్ని ప్రధాన విమానాశ్రయాల నుంచి 1255 విమాన సర్వీసులను బుధవారం ఉదయం రద్దు చేసినట్టు పీపుల్స్‌ డైలీ వెల్లడించింది. చైనాలోని పలు ప్రావిన్స్‌లలో బీజింగ్‌ నుంచి వచ్చే ప్రయాణికులను క్వారంటైన్‌ చేస్తున్నారు. అలాగే, అక్కడ ఇప్పటికే అధికశాతం పాఠశాలలు పునఃప్రారంభించినప్పటికీ మళ్లీ వాటిని మూసివేసి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని అధికారులు ఆదేశించారు. కరోనా వైరస్‌ బీజింగ్‌లో చాలా తీవ్రంగా ఉందని ఇటీవల బీజింగ్‌ నగర అధికారప్రతినిధి ఒకరు మంగళవారం వెల్లడించారు.  

11 మార్కెట్లు మూత
తాజాగా కరోనా కేసులు బయటపడుతుండటంతో బీజింగ్‌లోని 11 మార్కెట్లను అధికారులు మూసివేశారు. గడిచిన ఆరు రోజుల్లోనే బీజింగ్‌లో 137 పాజిటివ్‌ కేసులను నిర్ధారించారు. ప్రజలు మాస్క్‌లు ధరించడం తప్పనిసరని అధికారులు ఆదేశించారు. జిన్‌ఫాడీ మార్కెట్‌ను మే 30 నుంచి దాదాపు 2లక్షల మందికి పైగా సందర్శించారని అధికారులు తెలిపారు. ఈ మార్కెట్‌ ద్వారా దాదాపు 70శాతం పండ్లు, కూరగాయలు బీజింగ్‌కు సరఫరా అవుతాయని వెల్లడించారు. ఇప్పటికే 8వేల మంది వర్కర్లకు పరీక్షలు చేయించి వారందరినీ క్వారంటైన్‌ చేసినట్టు తెలిపారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని