రాహుల్ వాస్తవాలు తెలుసుకోండి

గల్వాన్‌ ఘటనలో భారత్‌ సైనికులను నిరాయుధులుగా పంపడం వల్లనే ప్రాణాలు కోల్పోయారని కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి జయ్‌శంకర్‌ తప్పుబట్టారు. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయ్‌శంకర్‌ ట్విటర్‌ ద్వారా

Published : 18 Jun 2020 22:49 IST

దిల్లీ: గల్వాన్‌ ఘటనలో భారత్‌ సైనికులను నిరాయుధులుగా పంపడం వల్లనే ప్రాణాలు కోల్పోయారని కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి జయ్‌శంకర్‌ తప్పుబట్టారు. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయ్‌శంకర్‌ ట్విటర్‌ ద్వారా రాహుల్‌కు బదులిచ్చారు. ‘‘ఇప్పుడు సూటిగా వాస్తవాలను తెలుసుకుందాం. సరిహద్దులో విధులు నిర్వహించే సైనిక దళాలు తమతో తప్పక ఆయుధాలను తీసుకెళ్తాయి. మన సైనికులు జూన్‌ 15 తేదీన గల్వాన్‌కు కూడా ఆయుధాలను తీసుకెళ్లారు. అయితే 1996, 2005 సంవత్సరాల్లో కుదిరిన ఒప్పందం మేరకు సరిహద్దులో ముఖాముఖి ఘర్షణ చోటు చేసుకుంటే ఆయుధాలు ఉపయోగించకూడదు నిబంధన ఉంది’’ అని జయ్‌శంకర్‌ పేర్కొన్నారు. గురువారం రాహుల్ గాంధీ గల్వాన్‌ ఘటనపై స్పందిస్తూ ‘‘నిరాయుధులైన మన సైనికులను చంపేందుకు చైనాకు ఎంత ధైర్యం?ఆయుధాలు లేకుండా మన సైనికులను ఎందుకు ప్రాణత్యాగం కోసం పంపారు’’ అని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత్ సైనికులు అమరులైన విషయం తెలిసిందే. సుమారు ఐదు దశాబ్దాల తర్వాత ఇరు దేశాల మధ్య ఈ ఘర్షణ చోటుచేసుకుంది. చైనా తరపున కూడా సుమారు 43 మంది మరణించడమో, గాయపడి ఉండడమో జరిగిందని భారత బలగాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు ఇరు దేశాల ఉన్నస్థాయి అధికారులు చర్చలు జరుపుతున్నారు 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని