ఇక ప్రతి వారమూ చైనాతో భారత్‌ చర్చలు

సరిహద్దుల్లో ఉద్రికత్తలు తగ్గించేందుకు ఇకపై భారత్‌, చైనా ప్రతి వారం చర్చలు జరపనున్నాయి. తూర్పు లద్దాఖ్‌లో డ్రాగన్‌ దుందుడుకు వైఖరి కొనసాగిస్తున్న నేపథ్యంలో సంప్రదింపులు, సహకార చర్చలు (డబ్ల్యూఎంసీసీ) కొనసాగుతాయని ప్రభుత్వ...

Published : 29 Jun 2020 01:51 IST

డ్రాగన్‌ సైనికుల మృతదేహాలను ఎయిర్‌లిఫ్ట్‌ చేశారన్న ప్రభుత్వ వర్గాలు

దిల్లీ: సరిహద్దుల్లో ఉద్రికత్తలు తగ్గించేందుకు ఇకపై భారత్‌, చైనా ప్రతి వారం చర్చలు జరపనున్నాయి. తూర్పు లద్దాఖ్‌లో డ్రాగన్‌ దుందుడుకు వైఖరి కొనసాగిస్తున్న నేపథ్యంలో సంప్రదింపులు, సహకార చర్చలు (డబ్ల్యూఎంసీసీ) కొనసాగుతాయని ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి.

‘తూర్పు లద్దాఖ్‌లో చైనా దుందుడుకు వైఖరి అంశంపై చర్చించేందుకు ప్రతి వారం డబ్ల్యూఎంసీసీ సమావేశాలకు అంగీకారం కుదిరింది. విదేశాంగ, రక్షణ, హోం శాఖ, సైనిక బలగాల సభ్యులు భారత్‌ వైపు ప్రతినిధులుగా ఉంటారు’ అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గత వారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన డబ్ల్యూఎంసీసీ సమావేశంలో లద్దాఖ్‌లో సమస్యల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించామని పేర్కొన్నాయి.

గత వారం డబ్ల్యూఎంసీసీ సమావేశాల్లో గల్వాన్‌ లోయలో జరిగిన సైనిక ఘర్షణలో ఎంత మంది సైనికులు హతమయ్యారో డ్రాగన్‌ వర్గాలు అసలు నోరు విప్పలేదని భారత వర్గాలు తెలిపాయి. ఇటువైపు 20 మంది జవాన్లు అమరులయ్యారని ఘర్షణ జరిగిన తెల్లవారే చెప్పినా అటువైపు ఇంకా మౌనమే పాటిస్తున్నారని పేర్కొన్నాయి. అయితే కనీసం 43 మంది చైనీయులు మరణించగా వారి మృతదేహాలను హెలికాప్టర్లలో తరలించారని వెల్లడించాయి.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని