చైనాపై భారత నేవీ నిఘా

భారత నౌకాదళం అప్రమత్తమైంది. హిందూ మహా సముద్రంలో నిఘా కార్యక్రమాలను పెంచింది. చైనాతో ఉద్రికత్తలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టిందని సమాచారం. మిత్ర నౌకా దళాలైన అమెరికా, జపాన్‌ సహకారాన్నీ.....

Published : 29 Jun 2020 20:46 IST

ముంబయి: భారత నౌకాదళం అప్రమత్తమైంది. హిందూ మహా సముద్రంలో నిఘా కార్యక్రమాలను పెంచింది. చైనాతో ఉద్రికత్తలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టిందని సమాచారం. మిత్ర నౌకా దళాలైన అమెరికా, జపాన్‌ సహకారాన్నీ తీసుకుందని తెలిసింది.

హిందూ మహా సముద్రంలో జపాన్‌ నౌకదళంతో కలిసి భారత్‌ కీలక ప్రదర్శన నిర్వహించాయి. ఇందులో ఐఎన్‌ఎస్‌ రాణా, ఐఎన్‌ఎస్‌ కులిశ్‌, జేఎస్‌ కషిమా, జేఎస్‌ షిమయుకి సంయుక్తంగా పాల్గొన్నాయి. ఈ ప్రాంతంలోనే చైనా నావలు, జలాంతర్గాములు తరచూ సంచరిస్తుంటాయి. దక్షిణ చైనా సముద్రం, ఇండో పసిఫిక్‌ సముద్ర జలాల్లో చైనా నేవీ దుందుడుకు చర్యలు కనిపించడంతో భారత్‌ అప్రమత్తమైంది.

ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో చైనా సైనిక స్థావరాలను ఏర్పాటు చేస్తుండటంతో అమెరికా, భారత్‌, ఆస్ట్రేలియా, జపాన్‌, ఫ్రాన్స్‌ నౌకాదళాలు పరస్పరం సహకరించుకుంటున్నాయి. గల్వాన్‌ లోయలో డ్రాగన్‌ సైనికులతో ఘర్షణ జరిగిన తర్వాత సైన్యం, వాయుసేన, నౌకా దళాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. దీంతో హిందూ మహా సముద్ర ప్రాంతంలో చైనా కదలికలను గమనించేందుకు నిఘా పెంచుతున్నామని సైనిక అధికారి ఒకరు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని