టిక్‌టాక్‌: బీజింగ్‌కు దూరంగా ప‌్ర‌ధాన‌ కార్యాల‌యం‌!

భార‌త్‌లో కోట్ల మంది యూజ‌ర్ల‌కు దూర‌మైన టిక్‌టాక్ త‌న‌పైప‌డ్డ మ‌ర‌క‌ల‌ను చెరిపే ప్ర‌య‌త్నం చేసుకుంటోంది. తాజాగా త‌న మాతృసంస్థ బైట్‌డాన్స్‌లో భారీ మార్పులు చేప‌ట్టే యోచ‌న‌లో ఉన్న‌ట్లు సంస్థ ప్ర‌క‌టించింది. దీనిలోభాగంగా తొలుత ఆ సంస్థ‌ ప్ర‌ధాన కార్యాల‌యాన్ని బీజింగ్ నుంచి దూరంగా త‌ర‌లించే ప్ర‌య‌త్నం చేస్తోంది.

Published : 10 Jul 2020 15:06 IST

మాతృసంస్థ బోర్డులో భారీ మార్పులు..
బీజింగ్ నుంచి బ‌య‌టప‌డేందుకు బైట్‌డాన్స్ ప్ర‌య‌త్నాలు

బీజింగ్‌: భార‌త్‌లో కోట్ల మంది యూజ‌ర్ల‌కు దూర‌మైన టిక్‌టాక్ త‌న‌పైప‌డ్డ మ‌ర‌క‌ల‌ను చెరిపే ప్ర‌య‌త్నం చేసుకుంటోంది. తాజాగా త‌న మాతృసంస్థ బైట్‌డాన్స్‌లో భారీ మార్పులు చేప‌ట్టే యోచ‌న‌లో ఉన్న‌ట్లు సంస్థ ప్ర‌క‌టించింది. దీనిలోభాగంగా తొలుత ఆ సంస్థ‌ ప్ర‌ధాన కార్యాల‌యాన్ని బీజింగ్ నుంచి దూరంగా త‌ర‌లించే ప్ర‌య‌త్నం చేస్తోంది. అతిపెద్ద కార్యాల‌యాలు లాస్ఏంజెల్స్, న్యూయార్క్‌, డ‌బ్లిన్‌, ముంబ‌యిలలో ఉన్న‌ట్లు ఇదివ‌రకే వెల్ల‌డించిన సంస్థ, ప్ర‌స్తుతం ప్ర‌ధాన‌కార్యాల‌యాన్ని ఎక్క‌డికి మారుస్తార‌న్న విష‌యాన్ని వెల్ల‌డించ‌లేదు.

వ్య‌క్తిగ‌త స‌మాచార భ‌ద్ర‌త‌పై అమెరికా జాతీయ భ‌ద్ర‌తా విభాగం జ‌రిపిన‌ విచార‌ణ అనంత‌రం టిక్‌టాక్ బీజింగ్ నుంచి దూర‌మౌతోంద‌ని గ‌తంలోనే వార్త‌లు వ‌చ్చాయి. ఈ సంద‌ర్భంలో ఇప్ప‌టికే ఆ యాప్‌కు అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న భార‌త్ దాన్ని నిషేధించింది. తాజాగా అమెరికా కూడా టిక్‌టాక్‌పై నిషేధాన్ని ప‌రిశీలిస్తున్నామ‌ని అధ్య‌క్షుడు ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించిన నేప‌థ్యంలో టిక్‌టాక్ మ‌రోసారి అప్ర‌మ‌త్త‌మైంది. త‌న‌పై చైనా మ‌ర‌క‌ల‌ను తొల‌గించుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇదిలాఉంటే, టిక్‌టాక్ త‌న‌ పారదర్శక నివేదిక‌ను ఈ గురువారం విడుద‌ల చేసింది. గ‌త సంవ‌త్స‌రం ద్వితియార్థంలోనే టిక్‌టాక్ నిబంధ‌న‌లు ఉల్లంఘించిన దాదాపు 5కోట్ల వీడియోల‌ను తొల‌గించిన‌ట్లు నివేదికలో పేర్కొంది.

ఇవీ చ‌ద‌వండి..
టిక్‌టాక్‌ను నిషేధాన్ని ప‌రిశీలిస్తున్నాం..ట్రంప్‌
డిజిట‌ల్ యుద్ధం: టిక్‌టాక్ స‌హా 59 చైనా యాప్‌ల‌పై నిషేధం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని