న్యూయార్క్‌ అసెంబ్లీలో ‘కశ్మీర్‌’ తీర్మానం

అమెరికాలోని న్యూయార్క్‌ రాష్ట్ర అసెంబ్లీ వివాదాస్పద తీర్మానం చేసింది. ఫిబ్రవరి 5వ తేదీని ‘కశ్మీర్‌ అమెరికన్‌ డే’గా ప్రకటించాలంటూ తీర్మానం చేయగా..

Updated : 08 Feb 2021 12:56 IST

వ్యతిరేకించిన భారత్‌

న్యూయార్క్‌: అమెరికాలోని న్యూయార్క్‌ రాష్ట్ర అసెంబ్లీ వివాదాస్పద తీర్మానం చేసింది. ఫిబ్రవరి 5వ తేదీని ‘కశ్మీర్‌ అమెరికన్‌ డే’గా ప్రకటించాలంటూ తీర్మానం చేయగా.. దీన్ని భారత్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. న్యూయార్క్‌ అసెంబ్లీ సభ్యుడు నాదర్‌ సయేగ్‌ మరో 12 మంది కలిసి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ‘‘కశ్మీర్‌ సమాజం ప్రతికూలతలను అధిగమించింది. పట్టుదలతో ఉంది. న్యూయార్క్‌ వలసవాదులందరిలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించించుకుంది. కశ్మీరీ ప్రజలకు మత, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ తదితర మానవహక్కులను కల్పించడానికి న్యూయార్క్‌ ప్రయత్నిస్తుంది’’ అని తీర్మానంలో పేర్కొన్నారు. దీనిపై వాషింగ్టన్‌లోని భారత దౌత్యకార్యాలయ ప్రతినిధి తీవ్రంగా స్పందించారు. అమెరికా మాదిరిగా భారత్‌ కూడా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, భిన్నమైన సంస్కృతికి నిదర్శమని.. అందులో జమ్మూ-కశ్మీర్‌ భాగమేనని గుర్తుచేశారు. తమ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం సరికాదని స్పష్టం చేశారు. ఇది జమ్మూ-కశ్మీర్‌ గొప్ప సంస్కృతిని, సామాజిక స్థితిని తప్పుగా చూపించేందుకు.. ప్రజలను విడదీసేందుకు స్వార్థ ప్రయోజనాలతో చేసిన ప్రయత్నంగా పేర్కొన్నారు. న్యూయార్క్‌ అసెంబ్లీ సభ్యులను కలిసి భారత్‌-అమెరికా సత్సంబంధాలపై చర్చిస్తామన్నారు.

ఇవీ చదవండి..
సాగుచట్టాలపై ప్రతిపక్షాలది యూటర్న్‌

ఉత్తరాఖండ్‌లో సహాయక చర్యల పునరుద్ధరణ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని