Covid వాసన పొందడానికి శిక్షణే మేలు

కొవిడ్‌-19 బారినపడివారికి వాసన చూసే సామర్థ్యం తగ్గిపోతుంటుంది.

Updated : 12 Aug 2022 15:17 IST

బ్రిటన్‌ శాస్త్రవేత్తల సూచన 

లండన్‌: కొవిడ్‌-19 బారినపడివారికి వాసన చూసే సామర్థ్యం తగ్గిపోతుంటుంది. అయితే ఇలాంటి వారికి స్టెరాయిడ్లను ఇవ్వరాదని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు సూచించారు. దానికి బదులు వారికి వాసన సామర్థ్యాన్ని పెంచే శిక్షణ ఇవ్వాలని కోరారు. రోజుకు రెండుసార్లు కనీసం నాలుగు భిన్నరకాల వాసనలను వారికి చూపాలని సూచించారు. ఇలా కొన్ని నెలల పాటు చేయాలన్నారు. ‘‘కొవిడ్‌ వల్ల వాసన సామర్థ్యం కోల్పోయిన వారిలో ఎక్కువ మందికి ఆ సమస్య వెంటనే సమసిపోతోంది. ప్రతి ఐదుగురిలో ఒకరికి మాత్రం 8 వారాల తర్వాత కూడా పరిస్థితి చక్కబడటంలేదు. అలాంటివారికి వైద్యులు కార్టికోస్టెరాయిడ్లను సూచిస్తుంటారు. ఇవి శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంటాయి. ఆస్థమా వంటి సమస్యలకు వీటిని వాడుతుంటారు. అయితే వీటివల్ల అధిక రక్తపోటు, భావోద్వేగాల్లో వైరుధ్యాలు వంటివి తలెత్తుతుంటాయి. అందువల్ల కొవిడ్‌ బాధితుల్లో వాసన సామర్థ్యాన్ని తిరిగి రాబట్టడానికి ఈ మందులను సూచించడానికి బదులు శిక్షణ కార్యక్రమం వైపు మళ్లాలి’’ అని యూనివర్సిటీ ఆఫ్‌ ఈస్ట్‌ ఆంగ్లియా నిపుణుడు కార్ల్‌ ఫిలిపాట్‌ పేర్కొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం చాలా చౌకైందని, ఎలాంటి దుష్ప్రభావాలకూ ఆస్కారం ఉండదని చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని