Google Maps: గూగుల్‌ చూపిన రహస్య దీవి 

కేరళ కోచి తీరంలో అరేబియా సముద్ర గర్భంలో ఓ దీవి లాంటి నిర్మాణం కనిపించడం చర్చనీయాంశంగా మారింది.

Published : 21 Jun 2021 10:27 IST

కోచి: కేరళ కోచి తీరంలో అరేబియా సముద్ర గర్భంలో ఓ దీవి లాంటి నిర్మాణం కనిపించడం చర్చనీయాంశంగా మారింది. గూగుల్‌ మ్యాప్స్‌తో బయటపడిన ఈ రహస్య దీవిపై పరిశోధకులు దృష్టి సారించారు. దీన్ని తొలిసారి చెల్లనమ్‌ కర్షిక టూరిజం డెవలప్‌మెంట్‌ సొసైటీ గుర్తించింది. కోచి తీరానికి 7 కి.మీ దూరంలో ఇది ఉన్నట్లు సంస్థ అధ్యక్షుడు జేవీఆర్‌ జుల్లప్పన్‌ చెప్పారు. నీటి అడుగున ప్రవాహం కారణంగా దీవి లాంటి నిర్మాణం ఏర్పడి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. తీర అవక్షేపం, కోతకు గురికావడం వంటి కారణాల వల్ల కూడా ఏర్పడే అవకాశం ఉందన్నారు. 8 కిలోమీటర్ల పొడవు, 3.5 కిలోమీటర్ల వెడల్పుతో ఈ నిర్మాణం ఉన్నట్లు చెప్పారు. గత నాలుగేళ్లుగా ఆ ప్రాంతంలో దీవిలాంటి నిర్మాణాన్ని గమనిస్తున్నామని, అయితే దాని పరిమాణంలో మాత్రం ఎలాంటి మార్పూ రాలేదని ఆ సంస్థ తెలిపింది. దీనిపై పరిశోధన చేయాల్సిందిగా కేరళ ప్రభుత్వం రాష్ట్ర ఫిషరీస్‌ అండ్‌ ఓషన్‌ స్టడీస్‌ అధికారులను ఆదేశించింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని