Ransomware: రాన్సమ్‌వేర్‌ను అడ్డుకోండి

రష్యా నుంచి జరుగుతున్న రాన్సమ్‌వేర్‌ దాడులను.. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అడ్డుకోవాలని,

Published : 11 Jul 2021 12:00 IST

లేకపోతే చర్యలు.. పుతిన్‌తో బైడెన్‌

వాషింగ్టన్‌: రష్యా నుంచి జరుగుతున్న రాన్సమ్‌వేర్‌ దాడులను.. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అడ్డుకోవాలని, లేకుంటే పరిణామాలు తప్పవని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హెచ్చరించారు. ఆయన శుక్రవారం పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. తాజాగా అమెరికాలోని సంస్థలపై జరిగిన రాన్సమ్‌వేర్‌ దాడులను ప్రస్తావించారు. రష్యాలోని కొందరు నేరగాళ్లు చేస్తున్న ఈ దాడుల కారణంగా అమెరికా సహా పలు దేశాలు ప్రభావానికి లోనవుతున్నాయని తెలిపారు. ‘‘రష్యా నుంచే దాడులు జరుగుతున్నాయని స్పష్టంగా పుతిన్‌కు చెప్పాను. ఈ దాడుల వెనుక ఆ ప్రభుత్వం లేకపోయినా, ఎవరున్నారో తెలుపుతూ మేం తగిన సమాచారమిస్తే..వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పాను’’ అని బైడెన్‌ తెలిపారు. ఈ విషయంలో ఇప్పటికే రష్యాతో సమాచారం ఇచ్చిపుచ్చుకొనే వ్యవస్థను నెలకొల్పామని కూడా పేర్కొన్నారు. అమెరికా ప్రజలకు, కీలక వ్యవస్థలకు ఎలాంటి నష్టం వాటిల్లినా తీవ్ర చర్యలు తప్పవని కూడా ఆ ఫోన్‌ సంభాషణలో పుతిన్‌కు బైడెన్‌ స్పష్టం చేసినట్లు శ్వేతసౌధం ప్రతినిధి తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని