Germany: జర్మనీలో జల విలయం 

జల విలయంతో జర్మనీ అల్లాడుతోంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా

Updated : 17 Jul 2021 19:46 IST

వరదల తీవ్రతకు 100 మందికి పైగా మృత్యువాత 
 బెల్జియంలో 18 మంది దుర్మరణం 

బెర్లిన్‌: జల విలయంతో జర్మనీ అల్లాడుతోంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో ఆ దేశంలో 100 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. బెల్జియంలోనూ వరదల బీభత్సం కొనసాగుతోంది. అక్కడ మృతుల సంఖ్య 18కి పెరిగింది. జర్మనీలో ప్రధానంగా రైన్‌లాండ్‌-పలాటినేట్, రైన్‌-వెస్ట్‌ఫాలియా రాష్ట్రాలు వరదలతో అతలాకుతలమవుతున్నాయి. ఇప్పటికే రైన్‌లాండ్‌-పలాటినేట్‌లో 60 మంది, రైన్‌-వెస్ట్‌ఫాలియాలో 43 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్నారు. జర్మనీలో గల్లంతైనవారిలో దాదాపు 1,300 మంది జాడ ఇంకా తెలియరాలేదు. వారి కోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వరదల తీవ్రతకు వేల మంది నిరాశ్రయులయ్యారు. బెల్జియంలో 19 మంది గల్లంతయ్యారు. అక్కడ సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఇటలీ బలగాలను పంపించింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని