Delta Variant: ‘డెల్టా’తో 300 రెట్లు వైరల్‌ లోడు

కరోనా వైరస్‌లో అధిక సాంక్రమిక శక్తి కలిగిన డెల్టా వేరియంట్‌ సోకిన వారిలో.. వ్యాధి లక్షణాలు మొదట బయటపడినప్పుడే వైరల్‌ లోడు చాలా ఎక్కువగా ఉంటోందని..

Updated : 25 Aug 2021 12:10 IST

సియోల్‌: కరోనా వైరస్‌లో అధిక సాంక్రమిక శక్తి కలిగిన డెల్టా వేరియంట్‌ సోకిన వారిలో.. వ్యాధి లక్షణాలు మొదట బయటపడినప్పుడే వైరల్‌ లోడు చాలా ఎక్కువగా ఉంటోందని దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు తేల్చారు. వైరస్‌కు సంబంధించిన మొదటి రకంతో పోలిస్తే 300 రెట్లు అధికంగా ఉంటోందని చెప్పారు. అయితే నాలుగు రోజుల తర్వాత వైరల్‌ లోడు 30 రెట్లకు, 9 రోజుల తర్వాత 10 రెట్లకు తగ్గుతుందన్నారు. కొరియా డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ ఏజెన్సీ (కేడీసీఏ) శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. ఒక వ్యక్తిలో వైరల్‌ లోడు అధికంగా ఉండటం వల్ల అతడి నుంచి వైరస్‌ వేగంగా ఇతరులకు వ్యాప్తి చెందుతుంది. ‘‘అయితే ఈ పరిశోధన బట్టి డెల్టా రకం 300 రెట్లు ఎక్కువ సాంక్రమిక శక్తిని కలిగి ఉందని భావించరాదు. దీని సాంక్రమిక శక్తి ఆల్ఫా వేరియంట్‌తో పోలిస్తే 1.6 రెట్లు, మొదట వెలుగు చూసిన కరోనా రకంతో పోలిస్తే దాదాపు రెండు రెట్లు ఎక్కువగా ఉంది’’ అని కేడీసీఏ ఉన్నతాధికారి లీ సాంగ్‌-వన్‌ తెలిపారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని