Booster Dose: బూస్టర్‌ డోసుతో తీవ్ర ముప్పు దూరం

రెండు డోసుల కొవిడ్‌ టీకా తీసుకున్నవారితో పోలిస్తే... బూస్టర్‌ డోసు పొందినవారిలో తీవ్రస్థాయి కొవిడ్‌ ముప్పు చాలా స్వల్పమని పరిశోధనలో

Updated : 02 Nov 2021 11:17 IST

బోస్టన్‌: రెండు డోసుల కొవిడ్‌ టీకా తీసుకున్నవారితో పోలిస్తే... బూస్టర్‌ డోసు పొందినవారిలో తీవ్రస్థాయి కొవిడ్‌ ముప్పు చాలా స్వల్పమని పరిశోధనలో తేలింది. హార్వర్డ్‌ యూనివర్సిటీ, క్లాలిట్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు దీన్ని ఇజ్రాయెల్‌లో చేపట్టారు. ఈ ఏడాది జులై, సెప్టెంబరు మధ్య ‘కొవిడ్‌ కారక అనారోగ్య సమస్యలు-ఫైజర్‌ బయోఎన్‌టెక్‌ ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ ప్రభావాల’ను వారు సమీక్షించారు. మూడో డోసు తీసుకున్న 7,28,321 మంది రోగనిరోధక శక్తి స్థాయులను... సుమారు ఐదు నెలల కిందట రెండో డోసు తీసుకున్న అంతే మందితో పోల్చి చూశారు.

‘‘మూడు డోసులు తీసుకున్నవారికి కరోనా కారణంగా ఆసుపత్రి పాలయ్యే ముప్పు 93%, తీవ్ర అనారోగ్య పరిస్థితి 92%, మరణ ముప్పు 81% తక్కువగా ఉంది’’ అని పరిశోధనకర్తలు చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని