Donald Trump: ‘ట్రంప్‌ ప్రభుత్వంలో వారంతా నిబంధనలు ఉల్లంఘించారు’

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో పనిచేసిన ప్రముఖులు అధికారిక పర్యటనల్లో 

Published : 11 Nov 2021 11:50 IST

దర్యాప్తు సంస్థల వెల్లడి

న్యూయార్క్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో పనిచేసిన ప్రముఖులు అధికారిక పర్యటనల్లో భాగంగా ఎన్నికల ప్రచారం కూడా చేసినట్టు దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. ట్రంప్‌ అల్లుడు, అధ్యక్షుని సలహాదారు అయిన జరేడ్‌ కుష్నర్, విదేశాంగ మంత్రిగా పనిచేసిన మైక్‌ పాంపియో సహా 13 మంది కావాలనే ఈ నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంటూ ఫెడరల్‌ దర్యాప్తు సంస్థ మంగళవారం పత్రాలను వెల్లడించింది. ఓటర్లను ప్రభావితం చేయడానికి వారు అధికారాన్ని దుర్వినియోగం చేశారని దర్యాప్తు సంస్థలు తెలిపాయి. అధ్యక్షుని నుంచి అధికారిక అనుమతులు తీసుకొని మరీ ప్రచారం చేశారని పేర్కొన్నాయి. అధ్యక్షుని కార్యాలయమైన శ్వేత సౌధంలోనే రిపబ్లికన్‌ పార్టీ సమావేశం జరిపారని తెలిపాయి. 

ట్రంప్‌నకు కోర్టులో ఎదురుదెబ్బ

వాషింగ్టన్‌: ట్రంప్‌నకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేపిటల్‌ హిల్‌పై దాడి ఘటనపై దర్యాప్తు చేస్తున్న సభా సంఘానికి సంబంధిత పత్రాలు ఇవ్వకుండా ఆదేశించాలంటూ ట్రంప్‌ చేసిన వినతిని డిస్ట్రిక్ట్‌ జడ్జి తాన్యా చుట్కన్‌ నిరాకరించారు. 

దాడిపై ముందే హెచ్చరించా: ప్రిన్స్‌ హ్యారీ

లండన్‌: కేపిటల్‌ హిల్‌పై దాడి జరుగుతుందని తాను ముందుగానే హెచ్చరించానని బ్రిటన్‌ రాకుమారుడు ప్రిన్స్‌ హ్యారీ చెప్పారు. ఈ దాడికి ట్విటర్‌ను వేదికగా చేసుకుంటారంటూ సీయీవో జాక్‌ డోర్సేకు ముందుగానే ఈ-మెయిల్‌ పంపించానని తెలిపారు. అయితే దీనిపై ఆయన ఇంతవరకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం వ్యాప్తిపై జరిగిన చర్చలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. తప్పుడు ప్రచారాన్ని సామాజిక మాధ్యమాలు అడ్డుకోవడం లేదని చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని