Nusrat Jahan: ఎంపీ నుస్రత్‌ జహాన్, నిఖిల్‌ జైన్‌ల వివాహం చట్టబద్ధంగా చెల్లదు

తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ, నటి నుస్రత్‌ జహాన్, వ్యాపారి నిఖిల్‌ జైన్‌ల వివాహం ‘చట్టబద్ధంగా చెల్లదు’ అని కోల్‌కతా

Updated : 18 Nov 2021 09:42 IST

కోల్‌కతా న్యాయస్థానం వెల్లడి

కోల్‌కతా: తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ, నటి నుస్రత్‌ జహాన్, వ్యాపారి నిఖిల్‌ జైన్‌ల వివాహం ‘చట్టబద్ధంగా చెల్లదు’ అని కోల్‌కతా న్యాయస్థానం ప్రకటించింది. టర్కీలోని బోడ్రమ్‌లో 19.06.2019న వారి మధ్య జరిగినట్టుగా చెబుతున్న వివాహం చట్టబద్ధం కాదని తేల్చిచెప్పింది. విభేదాల నేపథ్యంలో- తమ వివాహం చెల్లుబాటు కాదని ప్రకటించాలంటూ నిఖిల్‌ జైన్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హిందూ, ముస్లిం అయిన వారిద్దరూ ప్రత్యేక వివాహ చట్టం కింద పెళ్లి చేసుకోనందున, వారి ఏకాభిప్రాయ కలయికను వివాహంగా పరిగణించలేమని జడ్జి తేల్చిచెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని