Pfizer Vaccine: 5-11 ఏళ్ల చిన్నారులకు ఫైజర్‌ టీకా

ఫైజర్‌ సంస్థ తయారుచేసిన కొవిడ్‌ వ్యాక్సిన్‌ను 5-11 ఏళ్ల వయసు చిన్నారులకు

Published : 26 Nov 2021 14:02 IST

ఆమోదం తెలిపిన ఈఎంఏ

ద హేగ్‌: ఫైజర్‌ సంస్థ తయారుచేసిన కొవిడ్‌ వ్యాక్సిన్‌ను 5-11 ఏళ్ల వయసు చిన్నారులకు అందించేందుకు యూరోపియన్‌ యూనియన్‌ ఔషధ నియంత్రణ సంస్థ ‘యూరోపియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ (ఈఎంఏ)’ అనుమతించింది. దీంతో ప్రాథమిక విద్యను అభ్యసించే లక్షల మంది చిన్నారులకు ఈ టీకా చేరువకానుంది. యూనియన్‌ సభ్య దేశాల్లో ఈ వ్యాక్సిన్‌ను పంపిణీ చేయాలంటే యూరోపియన్‌ కమిషన్‌ కూడా ఆమోదముద్ర వేయాల్సి ఉంది. యూరప్‌ కేంద్రంగా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోందని, కట్టడి చర్యలు చేపట్టకుంటే సుమారు 20 లక్షల మంది మృతి చెందే ప్రమాదముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరించింది. ఈ క్రమంలోనే చిన్నారులకు వ్యాక్సిన్‌ అందించేందుకు ఈఎంఏ ఆమోదం తెలపడం గమనార్హం. ఆస్ట్రియా సర్కారు అనుమతుల కోసం నిరీక్షించకుండానే... రాజధాని వియెన్నాలోని 5-11 ఏళ్ల చిన్నారులకు ఇప్పటికే టీకాను అందిస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని