
Covid Vaccine: భాజపా రాష్ట్రాల్లోనే టీకా జోరు!
అధికారుల మాట ఇది..
దిల్లీ: కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలతో పోలిస్తే.. భాజపా పాలిత ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోందని అధికార వర్గాలు తెలిపాయి. ఎనిమిది భాజపా పాలిత రాష్ట్రాల్లో అర్హులైన జనాభాలో 50 శాతం మందికి వ్యాక్సినేషన్ ఇప్పటికే అందింది. అందులో ఏడు రాష్ట్రాల్లో 90 శాతానికిపైగా మొదటి డోసు పూర్తయింది. కాంగ్రెస్ పాలిత ఏ రాష్ట్రంలోనూ టీకా ప్రక్రియ ఆశించిన స్థాయిని అందుకోలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లు తొలి డోసు విషయంలో ఇంకా 90 శాతం మార్కును అందుకోలేదు. మిత్రపక్షాలతో కలిసి కాంగ్రెస్ అధికారంలో ఉన్న తమిళనాడు, మహారాష్ట్ర, ఝార్ఘండ్‌లోనూ అదే పరిస్థితి. బూస్టర్ డోసు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న ప్రతిపక్షాలు.. తమ రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించకపోవడంపై సంబంధిత వర్గాలు ఆవేదన వ్యక్తం చేశాయి.