Vaccine:తొమ్మిదో తరగతి విద్యార్థికి అర గంటలో 2 టీకాలు

తొమ్మిదో తరగతి విద్యార్థి అర గంట వ్యవధిలో రెండు కొవిడ్‌ టీకాలు వేయించుకున్న

Updated : 20 Jan 2022 11:25 IST

తొమ్మిదో తరగతి విద్యార్థి అర గంట వ్యవధిలో రెండు కొవిడ్‌ టీకాలు వేయించుకున్న ఘటన పశ్చిమబెంగాల్‌లోని ఖరగ్‌పుర్‌ సబ్‌ డివిజన్‌లో జరిగింది. దేబ్రాలోని అలోకా పాఠశాలలో చదువుతున్న సాథీదే అనే విద్యార్థి సోమవారం మొదటి టీకా వేయించుకున్నాడు. అనంతరం ఇంటికి వెళ్లకుండా పాఠశాల గేటు వద్ద తిరుగుతూ కనిపించాడు. వ్యాక్సిన్‌ వేసుకోవడానికి భయపడుతున్నాడని భావించిన పాఠశాల సిబ్బంది ధైర్యం చెప్పి, లోపలకు తీసుకెళ్లారు. టీకా వేయడం పూర్తయ్యాక తాను మొదటి టీకా కూడా వేయించుకున్నట్లు మెల్లగా చెప్పగా ఖంగుతిన్నారు. ఇలా ఎందుకు చేశావని వారు ప్రశ్నించగా.. ఒకేరోజు రెండు టీకాలు వేస్తారని అనుకున్నానని అమాయకంగా బదులిచ్చాడు. దీంతో ఆందోళన చెందిన వైద్యులు, ఉపాధ్యాయులు ఆ విద్యార్థిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యం సాధారణంగా ఉందని నిర్ధారించుకున్న అనంతరం ఇంటికి పంపించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని