Black Fungus: బ్లాక్‌ఫంగస్‌కు ‘పతంజలి’ నాసికా ఔషధం

బ్లాక్‌ ఫంగస్‌ (మ్యుకర్‌మైకోసిస్‌) వ్యాధిపై పనిచేసే సరికొత్త ఆయుర్వేదిక్‌ నాసికా ఔషధాన్ని (నేసల్‌ డ్రాప్‌)ను అభివృద్ధి

Updated : 23 Jan 2022 10:39 IST

దిల్లీ: బ్లాక్‌ ఫంగస్‌ (మ్యుకర్‌మైకోసిస్‌) వ్యాధిపై పనిచేసే సరికొత్త ఆయుర్వేదిక్‌ నాసికా ఔషధాన్ని (నేసల్‌ డ్రాప్‌)ను అభివృద్ధి చేసినట్లు పతంజలి సంస్థ వెల్లడించింది. ‘అనూ తైల’ పేరిట పతంజలి రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తల బృందం దీన్ని కనుగొన్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఇందుకు గాను అధునాతన సాంకేతిక విధానాలతో లోతైన పరిశోధన జరిగినట్లు పేర్కొంది. పరిశోధన వివరాలు ‘ది జర్నల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ మైక్రోబయాలజీ’లో ప్రచురితమయ్యాయి. ప్రాచీన ఆయుర్వేద ఔషధాలకు మరింత ప్రాచుర్యం కల్పించే దిశగా ఇది ఓ ముందడుగుగా పతంజలి పేర్కొంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని