Corona: తీవ్రస్థాయి కొవిడ్‌ రోగుల పాలిట సంజీవని!

తీవ్రస్థాయి కొవిడ్‌ బాధితుల ప్రాణాలను నిలబెట్టడంలో ఓ ఔషధ సమ్మేళనం మెరుగ్గా పనిచేస్తున్నట్లు పరిశోధకులు తేల్చారు.

Updated : 17 Jun 2021 06:44 IST

లండన్‌: తీవ్రస్థాయి కొవిడ్‌ బాధితుల ప్రాణాలను నిలబెట్టడంలో ఓ ఔషధ సమ్మేళనం మెరుగ్గా పనిచేస్తున్నట్లు పరిశోధకులు తేల్చారు. సొంతంగా యాంటీబాడీలను వృద్ధి చేసుకోలేకపోతున్న రోగుల పాలిట ఇది వరంగా మారే అవకాశముందని వారు పేర్కొన్నారు. అమెరికాకు చెందిన రీజెనరాన్‌ సంస్థ తయారుచేస్తున్న ‘రీజెన్‌-కొవ్‌’ అనే యాంటీ వైరల్‌ సమ్మేళనాన్ని.. గత ఏడాది సెప్టెంబరు నుంచి ఈ ఏడాది మే వరకు మొత్తం 9,875 మంది కొవిడ్‌ రోగులకు పరిశోధకులు అందించారు. అది కాసిరివిమాబ్‌, ఇమ్‌డెవిమాబ్‌ అనే రెండు మోనోక్లోనల్‌ యాంటీబాడీల మిశ్రమం. కణాల్లోకి చొచ్చుకెళ్లేందుకు కరోనా వైరస్‌ ఉపయోగించుకునే స్పైక్‌ ప్రొటీన్‌ సామర్థ్యాన్ని ఈ సమ్మేళనం దెబ్బతీస్తున్నట్లు తాము గుర్తించామని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం పరిశోధకుడు మార్టిన్‌ లాండ్రే తెలిపారు. వెంటిలేటర్‌ అవసరమయ్యే రోగుల సంఖ్య తగ్గుదలకు, ఆస్పత్రిలో చికిత్సా సమయాన్ని తగ్గించేందుకు ఇది దోహదపడుతున్నట్లు వెల్లడించారు. ప్రతి వంద మంది రోగుల్లో 6% మరణాలను ఈ సమ్మేళనం తగ్గించగలదని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని