
Updated : 16 Jul 2021 09:15 IST
WhatsApp: వాట్సప్ ద్వారా పింఛన్ చీటీ
దిల్లీ: పింఛనుదారులకు బ్యాంకుల నుంచి వాట్సప్ ద్వారా పింఛను చీటీలు (స్లిప్పులు) అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖాతాల్లో పింఛను జమ అయిన వెంటనే సంబంధిత సమాచారాన్ని పింఛనుదారులకు చేరవేసేందుకు ఎస్ఎంఎస్, ఈ-మెయిల్లతో పాటు వాట్సప్నూ వినియోగించుకోవచ్చునని బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పింఛనుదారుల జీవనాన్ని మరింత సులభతరం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. జమ అయిన సొమ్ము, పన్ను మినహాయింపుల వంటి వివరాలన్నీ చీటీలో ఉంటాయని పేర్కొంది. ఆదాయపు పన్ను, కరవు భృతి చెల్లింపులు తదితర వ్యవహారాల్లో ఈ వివరాలు ఉపయోగపడతాయని వివరించింది.
Tags :